Telugu News  /  Andhra Pradesh  /  Cm Ys Jagan Kadapa Tour For Two Days From 2nd December 2022
సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో) (twitter)

CM Jagan Kadapa tour: రేపు సొంత జిల్లాకు సీఎం జగన్... 2 రోజుల షెడ్యూల్ ఇదే

01 December 2022, 8:29 ISTHT Telugu Desk
01 December 2022, 8:29 IST

CM jagan Kadapa tour: ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా టూర్ ఖరారైంది. రెండు రోజుల పాటు(డిసెంబర్ 2 నుంచి) అక్కడే ఉండనున్న ఆయన.. పలు పనులకు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

CM YS Jagan Kadapa Tour Schedule: ఇప్పటికే పలు జిల్లాలకు వెళ్లిన సీఎం జగన్... ఇక సొంత జిల్లా(కడప)కు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా టూర్ షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రేపటి షెడ్యూల్ ..

డిసెంబర్‌ 2న ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ తన నివాసం నుంచి బయల్దేరి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. 11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం.. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టీని సీఎం జగన్ ప్రారంభిస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్ కు బయల్దేరుతారు.12.40 గంటలకు అక్కడకు చేరుకొని YSR లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అంటే నాలుగు గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఓ పది నిమిషాల పాటు స్థానిక నేతలతో మాట్లాడి.. 5.20 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్ హౌజ్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

ఎల్లుండి కార్యక్రమాలు...

ఇక డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు సీఎం జగన్. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్ కు చేరుకుంటారు. అక్కడ 9.15 నుంచి 9.30 వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. 09.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం 9.45 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. దీంతో సీఎం జగన్ కడప టూర్ ముగుస్తుంది.

మరోవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు అధికారులు.