CM Jagan Visit: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సిఎం జగన్
CM Jagan Visit: మిగ్‌జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు.
CM Jagan Visit: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.
అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు.
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు.
అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడతారు, అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
ఉదయం 8.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కోట మండలం విద్యానగర్‌కు రానున్నారు. అక్కడి నుంచి 10.30 గంటలకు రహదారి మార్గంలో వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న స్వర్ణముఖి రివర్ బ్యాంక్‌ను పరిశీలిస్తారు.
11.05 గంటలకు బాలిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను పరిశీలిస్తారు. అనంతరం తుపాను బాధిత ప్రజలతో మాట్లాడతారు. 11.40 గంటలకు తిరిగి విద్యానగర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి, నేరుగా బాపట్ల జిల్లాకు వెళ్లనున్నారు. ఆ జిల్లాలో కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం వద్ద నీటిలో ఉన్న మిర్చి పంట, బుద్దాం వద్ద తుంగభద్ర కాల్వ పక్కనే నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.