CM Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు-cm jagan tour in prakasam district today no entry for media cameras and photographers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు

CM Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు

Sarath chandra.B HT Telugu
Feb 23, 2024 06:20 AM IST

CM Jagan Ongole Tour: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు ప్రకాశం జిల్లా ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొననున్నారు. రాప్తాడు Raptadu ఘటన నేపథ్యంలో సిఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో పలు ఆంక్షలు విధించారు.

నేడు ప్రకాశం జిల్లాలో  ముఖ్యమంత్రి జగన్ పర్యటన
నేడు ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

CM Jagan Ongole Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రకాశం Prakasam జిల్లాలో పర్యటించనున్నారు. పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఒంగోలులోOngole రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

yearly horoscope entry point

దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ Conveyance Deeds అందిస్తున్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ Prakasam Corporation పరిధిలో 20,840 మంది పేద మహిళలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూమి బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి ధృవీకరణ పత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు.

'నవరత్నాలు Navaratnalu-పేదలందరికీ ఇళ్లు' క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను లబ్దిదారులైనమహిళల పేరిట సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కన్వేయన్స్ డీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు...

పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ Free Registrationsచేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

గ్రామ/వార్డు సచివాలయాల్లో GSWS ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (జెఎస్ఆర్వో) డేటాబేస్‌లో వివరాలన్నీ పదిలంగా ఉన్నాయి. ఎప్పుడైనా ఈ జెఎస్ఆర్వోలలో సర్టిఫైడ్ కాపీలు పొందే అవకాశం ఉంటుంది. లబ్దిదారుల వివరాలను ఫోర్జరీ చేయడం, ట్యాంపర్ చేయడానికి ఆస్కారం ఉండదు..

పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు లబ్దిదారులకు లభిస్తాయి. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు కలుగుతుంది. ఇంటిని అమ్ముకునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఎలాంటి లింకు డాక్యుమెంట్ల Link Documentsఅవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ చేస్తారు. శుక్రవారం ఒంగోలులో జరిగే కార్యక్రమంలో స్థలం కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు.

అర్హులైన 20,840 మంది మహిళలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల లబ్దిదారుల కోసం ఇప్పటికే గుర్తించారు.

భూసేకరణ చేసి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్ అందజేస్తున్నారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిప్ ల అభివృద్ధికి రూ.210 కోట్లు వెచ్చించారు.. లే అవుట్ ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.

ఒక్కోప్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతున్న నేపథ్యంలో వాటి కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

దీంతో పాటు సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పించినట్టు ఏపీ సర్కారు చెబుతోంది.

ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడంతో పాటు యూనిట్ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తున్నారు. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ. 40 వేల మేర లబ్ధి కలుగుతోంది.

ఒక్కో లబ్ధిదారునికి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ. 1 లక్ష లబ్ధి చేకూరుస్తున్నారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఒక్కో ఇంటికి సగటున రూ.6లక్షల నుంచి రూ.20లక్షల వరకు లబ్ది చేకూరుతోంది. రాష్ట్రంలో కొత్తగా మహిళల చేతిలోకి రూ.2లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల విలువైన ఆస్తులు సమకూరినట్టు చెబుతున్నారు.

మీడియాకు నో ఎంట్రీ…

రాప్తాడులో మీడియాపై జరిగిన దాడి నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లో జరిగిన బహిరంగ సభకు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు ప్రవేశం లేదని No Entry for Media ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా పాసులు ఉన్న వారికి మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని ప్రకటించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సభల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు, సభల నుంచి జనం వెళ్లిపోతున్న దృశ్యాలను కొంతకాలంగా రాజకీయ ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారని భావించిన అధికారులు అధికారికంగా మాత్రమే ఫోటోలు, వీడియోలు విడుదల చేయాలని నిర్ణయించింది. బహిరంగ సభల్లోకి మీడియాను అనుమతించకూడదని నిర్ణయించారు.

Whats_app_banner