Kurnool Jagan Meeting: మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే రైతులకు ఎక్కువే చేశామన్న జగన్-cm jagan said that he has done more good to the farmer than the promise ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan Said That He Has Done More Good To The Farmer Than The Promise

Kurnool Jagan Meeting: మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే రైతులకు ఎక్కువే చేశామన్న జగన్

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 12:30 PM IST

Kurnool Jagan Meeting: 32లక్షల మంది రైతులకు రూ.3900కోట్ల రుపాయల రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సిఎం కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నట్లు చెప్పారు.

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సిఎం జగన్
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సిఎం జగన్

Kurnool Jagan Meeting: 32లక్షల మంది రైతులకు రూ.3900కోట్ల రుపాయల రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సిఎం కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నట్లు చెప్పారు. 5వ ఏడాది తొలి విడత సాయాన్ని కర్నూలు నుంచి సిఎం జగన్ విడుదల చేశారు.రైతులు పంట పండించేసరికి రైతులు ఇబ్బంది పడకూడదని,రైతులు పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకుండా ఉండటానికి ప్రభుత్వమే సాయం చేస్తోందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో హెక్టారు లేని రైతులు 70శాతం మంది, అర హెక్టారు కూడా లేని వారు 60శాతం ఉన్నారని సిఎం జగన్ చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే మిన్నగా రూ.13,500ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో నాలుగేళ్లు ఇస్తామని చెప్పిన హమీకి మించి ఐదేళ్లు ఇస్తున్నట్లు చెప్పారు.

రైతులకు అదనపు ప్రయోజనాలు

ప్రతి రైతుకు 17,500 అదనంగా చెల్లించినట్లు సిఎం చెప్పారు. 50లక్షల మంది రైతులకు రూ54వేల రుపాయలు వైఎస్సార్ రైతు భరోసాగా చెల్లించామన్నారు.ఈ దఫా ఇచ్చే రూ.7500కు కలిపితే ఇప్పటికే రైతుకు రూ.61,500 చెల్లించినట్లు అవుతుందన్నారు.

రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సహాయం కింద ఈ ఏడాది తొలి విడతలో రూ.3920కోట్ల విడుదల చేస్తున్నామన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న సాయంలో రూ.5500 నేడు రైతుల ఖాతాకు చేరుతాయని, మిగిలిన రెండు వేల రుపాయలు కేంద్రం నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు.కేంద్రం ఇచ్చే సాయం ఆలస్యమైనా ప్రతి మేలో అందాల్సిన సాయం నేరుగా చెల్లిస్తున్నట్లు చెప్పారు.

రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు నాలుగేళ్లలో వారి ఖాతాల్లో రూ.31వేల కోట్ల రుపాయలను జమ చేశామన్నారు. 52.30లక్షల మంది రైతులకు లబ్ది కలిగించామని వివరించారు.

రైతు భరోసాతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఏ సీజన్‌ డబ్బు అదే సీజన్‌లో చెల్లించే విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పంట నష్టాన్ని చెల్లిస్తున్నామన్నారు.

వ్యవసాయ పనుల కోసం….

రైతులు ఇబ్బంది పడకుండా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా ఆలశ్యం లేకుండా క్రమం తప్పకుండా రూ.1965కోట్ల రుపాయలను ఇన్‌ఫుట్ సబ్సిడీగా చెల్లిస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో వ్యవసాయం రైతులకు అండగా,దన్నుగా నిలబడుతూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు.

వ్యవసాయంలో రైతులకు తమ దగ్గరే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చంద్రబాబు హయంలో ఇలాంటి ఆలోచనైనా తట్టలేదన్నారు. టీడీపీ హయంలో రైతు భరోసా కేంద్రంలో వాటి ఆలోచన కూడా లేదన్నారు.

విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలో రైతుకు 10778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్నదాతకు నిరంతరం తోడుగా అండగా ఉండేలా వాటిని ఏర్పాటు చేశామన్నారు.

2014-19 మధ్య కాలంలో ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153లక్షల టన్నులు ఉంటే 2019-23 మధ్య కాలంలో ఏటా 165లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన పంటలు దిగుబడి కూడా 228లక్షల టన్నుల నుంచి 332లక్షల టన్నులకు పెరిగిందన్నారు.

చంద్రబాబు హయంలో కరువు విలయతాండవం…

చంద్రబాబు హయంలో ఏ ఏడాది చూసిన కరువు విలయతాండవం చేసేదన్నారు. బాబు హయంలో ప్రతి ఏడాది సగం మండలాలు కరువు మండలాలుగా ఉండేవని, 1623 మండలాలను కరువులో ఉంచారని, వైసీపీ హయంలో దేవుడి దయతో 2019 నుంచి మంచి వానలు కురిశాయని, కరువులు లేవని, వలసలు లేవని జగన్ చెప్పారు.

నాలుగేళ్లలో ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పాలన సాగిందన్నారు. చంద్రబాబు హయంలో సున్నా వడ్డీ కింది. 40.60లక్షల మందికి 685కోట్లు అందిస్తే, 2019నుంచి రూ.1835కోట్లు సున్నా వడ్డీ కింద చెల్లించామన్నారు. 74లక్షల మంది రైతులకు మంచి చేశామని వివరించారు. చంద్రబాబు ఇవ్వకుండా పెట్టిన బకాయిలను సైతం తాము చెల్లించామన్నారు.

సున్నా వడ్డీ పథకంలోనే మూడు రెట్లు అధికంగా రైతులకు మేలు చేశామన్నారు. 30.85లక్షల మంది రూ.3411కోట్లు ఐదేళ్లలో పంటల భీమాగా ఇస్తే , తాము నాలుగేళ్లలో వైఎస్సార్ ఉచిత పంటల భీమాలో 44లక్షల మందికి రూ.6685కోట్లు చెల్లించామన్నారు.

వైఎస్సార్ జయంతి రోజు ఇన్స్యూరెన్స్ సొమ్ము…

రైతులకు చెల్లించాల్సిన ఇన్స్యూరెన్స్ సొమ్మును వైఎస్ జయంతి సందర్భంగా జులై 8న జమ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఒక్క రుపాయి కూడా బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా తామే భరిస్తామని వెల్లడించారు.

గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు ఏర్పాటు చేశామని, ఈ క్రాప్ బుకింగ్ చేసి, సోషల్ ఆడిట్ కోసం ప్రకటిస్తున్నామని, ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతులకు మంచి చేస్తున్నామన్నారు.

గతంలో ఈ క్రాప్ అనే మాట లేదని, పోషల్ ఆడిట్ లేదన్నారు. గత పాలనకు తమ పాలనకు తేడా గమనించాలని కోరారు.

టీడీపీ కంటే అధికంగా ధాన్యం సేకరణ…

గత ప్రభుత్వ హయంలో ఐదేళ్ల కాలంలో 2.65కోట్ల టన్నుల ధాన్యం సేకరిస్తే, నాలుగేళ్లలో తాము 3.09కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. రబీల సేకరణ జరుగుతోందని వివరించారు. గతంతో పోలిస్తే ఏటా 53లక్షల టన్నులు సేకరిస్తే ఇప్పుడు 75లక్షల టన్నులు సేకరిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం సేకరణకు 40,237కోట్లు ఖర్చు చేస్తే నాలుగేళ్లలో రూ.60వేలు ఖర్చు చేశామన్నారు. రబీ పూర్తికాకపోయినా, ఐదేళ్లలో రూ.70వేల కోట్ల ఖర్చుచేసిన ప్రభుత్వం తమది అన్నారు.

విత్తనాల నుంచి నకిలీ ఎరువుల వరకు, భూసార పరీక్షలపై గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ద చూపలేదని, ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేవామన్నారు. రాష్ట్రంలో నాలుగు రీజినల్ కోడింగ్ సెంటర్లు, 2 జిల్లా ల్యాబ్‌లు, మరో 11 నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఆర్బీకేలలో సీడ్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ చేయిస్తున్నామని చెప్పారు.

సమగ్ర భూసర్వే….

రైతులకు పంటతో పాటు భూమిపై సర్వ హక్కులు ముఖ్యమనే ఉద్దేశంతో వందేళ్ల క్రితం చేసిన భూసర్వే జరిగినందున, ఎవరు పట్టించుకోవట్లేదని, గ్రామ స్థాయిలో సరిహద్దులు లేవని, సబ్ డివిజన్ అప్డేట్ కాలేదని, భూవివాదాలు జరుగుతున్నాయని, పరిష్కారం లేని సమస్యలు తీర్చడానికి వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టి రికార్డులు అప్డేట్ చేసి,వివాదాలకు ఏమాత్రం తావులేని విధంగా రైతుల చేతుల్లో భూహక్కు పత్రాలను పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు.

గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలను ప్రారంభించామని,అక్కడే రిజిస్ట్రేషన్లు జరిగేలా చేస్తున్నామన్నారు. ఎప్పుడు జరగని విధంగా రైతులకు భూమిపై సర్వ హక్కులు ఇప్పించడానికి చుక్కల భూములపై హక్కులను రైతులకు కల్పించామని చెప్పారు. రైతులకు నిషేధిత భూములపైసర్వ హక్కులు కల్పించామని చెప్పారు.

నాలుగేళ్ల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండటానికి పగటిపూటే 9గంటల విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తమది అన్నారు. రూ.1700కోట్లతో రైతులకు ఎలక్ట్రికల్ ఫీడర్లు బలపరిచామని వివరించారు. అక్వా రైతులకు 2967కోట్ల రుపాయల సబ్సిడీలుగా చెల్లించామన్నారు. నాలుగేళ్లు వర్షాలు బాగా పడటం వల్ల రాయలసీమ కూడా కళకళలాడుతోందన్నారు.

భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయన్నారు. రైతులకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వంగా మహిళలకు తోడుగా నిలవడానికి అమూల్‌ను రాష్ట్రానికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. అమూల్ రావడం వల్ల దోచుకుంటున్న హెరిటేజ్ వంటి సంస్థలు సేకరణ ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. పాలధరలు రూ.10-17వరకు పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హెరిటేజ్ వంటి సంస్థలు పాలధరలు తప్పనిసరిగా ధర పెంచాల్సి వచ్చిందన్నారు.

కేంద్రం మద్దతు ధర ప్రకటించని ఆరు పంటలకు కూడా మద్దతు ధర చెల్లిస్తున్నామని,ఫలితంగా రైతులకు కనీస గిట్టుబాటు ధర లభిస్తోందని చెప్పారు. దళారులు లేకుండా అమ్ముకునే అవకాశం వచ్చిందన్నారు. చంద్రబాబు ఎగ్గొట్టిపోయిన ధాన్యం సేకరణ సొమ్ము రూ.900కోట్లు, కరెంటు బకాయిలు రూ.8800కోట్లు తామే చెల్లించినట్లు చెప్పారు.

WhatsApp channel