CM Jagan Review : వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి-cm jagan review on agriculture and horticulture departments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review : వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి

CM Jagan Review : వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 15, 2023 08:17 AM IST

CM Jagan Review On Agriculture: వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలన్నారు సీఎం జగన్. పుడ్‌ ప్రాసెసింగ్‌ విషయంలో మరింత ముందుకు వెళ్లాలని... డ్రోన్ల ద్వారా వ్యవసాయానికి...రైతులకు మరింత మేలు జరగాలని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయరంగంపై సీఎం జగన్ సమీక్ష
వ్యవసాయరంగంపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan Review On Agriculture:వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధశాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ–క్రాపింగ్‌లో జియో ఫెన్సింగ్‌ ఫీచర్‌ కూడా కొత్తగా ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. ఖరీఫ్‌ పంటల ఈ– క్రాపింగ్‌ మొదలైందని, ఈసారి ముందస్తుగానే మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు డేటాను అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.... ఇప్పటికే పురుగుమందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలని తెలిపారు. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. భూసార పరీక్షలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు.

డ్రోన్ల ద్వారా డేటా కూడా కచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. దీంతోపాటు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వరి దిగుబడులపై డ్రోన్ల ద్వారా అంచనాలు పొందేలా డ్రోన్‌ టెక్నాలజీని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పగా.. మిగతా పంటల విషయంలో కూడా ఈ తరహా ప్రయోజనాలు డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం పేర్కొన్నారు. బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించుకోవడంవల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్‌లు ద్వారా 2.2 లక్షల శాంపిళ్లను సేకరించి రైతులకు ఫలితాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. అయితే కౌలు రైతులకుకి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ. 7802.5 కోట్లు 54.48 లక్షల మందికి పరిహారంగా అందించామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి పంట బీమా పరిహారాన్ని అక్టోబరులో ఇచ్చేందుకు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నామని అధికారులు వివరించారు.

10వేల ఆర్బీకేల్లో 10 వేల డ్రోన్లు తీసుకువచ్చి వాటితో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు అధికారులు. ముందస్తుగా 2వేల డ్రోన్లు తీసుకువస్తున్నామని, డ్రోన్‌ టెక్నాలజీలో 222 రైతులకు శిక్షణ ఇచ్చి పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ల విషయలో భద్రత, సమర్థవంతమైన నిర్వహణ, సర్వీసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. డ్రోన్‌ ఖరీదైనది కాబట్టి భద్రత, రక్షణ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న అధికారులు... డీజీసీఏ సర్టిఫికేషన్‌ను పాటిస్తున్నామన్న అధికారులు. అన్నిరకాల భధ్రతా ప్రమాణాలు పాటించేలా, ఎదురుగా వచ్చే వస్తువును ఢీకొట్టకుండా నిలువరించే

రెగ్యులర్‌ మార్కెట్‌కే కాకుండా పుడ్‌ ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. గోడౌన్లు, కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ రూమ్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.. పుడ్‌ ప్రాసెసింగ్‌ విషయంలో మరింత ముందుకు వెళ్లాలన్నారు. పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలన్నారు. అంతేకాకుండా మహిళలతో నడిచే సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నంచేయాలని... మహిళల్లో స్వయం ఉపాధికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. చేయూత లాంటి పథకాన్ని వినియోగించుకుని ఈ యూనిట్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధికి ఊతమివ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు

సంబంధిత కథనం