Cyclone Mandous : తుపాను ప్రభావిత జిల్లాలపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు-cm jagan reveiw on cyclone mandous ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Cm Jagan Reveiw On Cyclone Mandous

Cyclone Mandous : తుపాను ప్రభావిత జిల్లాలపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు

సీఎం జగన్
సీఎం జగన్

Mandous Cyclone : మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న మాండూస్ తుపానుపై(cyclone mandous) సీఎం జగన్(CM Jagan) సమీక్ష నిర్వహించారు. తుపానుపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాల ఇచ్చారు. తుపాను ప్రభావిత జిల్లా కలెక్టర్లతో చర్చించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారు. పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. రైతులకు తుపానుపై అవగాహన కల్పించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

'ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతు సహాయకారిగా ఉండాలి. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా చూడాలి. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి.' అని సీఎం జగన్‌(CM Jagan) చెప్పారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పంటలకు నష్టం వాటిళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతం(Bay Of Bengal)లో కొనసాగిన తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారింది. ఈ మేరకు వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరించింది. తుపాను కారణంగా తమిళనాడు(Tamil Nadu), దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

మూడు రోజులపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు(Nellore), తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుపానుకు మాండూస్‌ అని పేరు పెట్టారు. 9వ తేదీన పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 65–75 కి.మీలు, గరిష్టంగా 85 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇది అంచనాకి మించి నష్టం కలిగించే ప్రమాదం ఉందని లెక్కలు వేస్తున్నారు.

మరోవైపు తుపాన్ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది---.

WhatsApp channel

సంబంధిత కథనం