AP CM Visakha Shifting: దసరా విశాఖలోనే, జమిలికి జై.. క్యాబినెట్‌లో సిఎం జగన్
AP CM Visakha Shifting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలను విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు సిఎం జగన్ రెడీ అయ్యారు. దసరా నాటి నుంచి విశాఖలోనే సిఎంఓ కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి వర్గ సహచరులకు సిఎం జగన్ స్పష్టత ఇచ్చారు.
AP CM Visakha Shifting: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవహారాలను విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించాలని సిఎం జగన్ నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విశాఖపట్నం రాజధాని తరలింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి పూర్తి చేయాలని సిఎం జగన్ భావిస్తున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది దసరా పండుగ విశాఖపట్నంలో జరుపుకుంటామని సిఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజాధాని వికేంద్రీకరణ విషయంలొ 2019 డిసెంబర్ నుంచి వివాదం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో పాటు కోర్టు వివాదాలు తలెత్తాయి. సిఎం జగన్ విశాఖలో బస చేయడానికి అనువుగా రిషికొండలో నిర్మాణాలను కూడా పూర్తి కావొస్తున్నాయి.
రాజధాని తరలింపు విషయంలో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్లనివ్వకుండా చేశామని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన ఎక్కడి నుంచైనా చేపట్టే అవకాశాలు ఉండటంతో దసరా పండుగ నాటి నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
పరిపాలన రాజధానిగా విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఈ విషయంలో ముందడుగు పడొచ్చు. హైకోర్టు, సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్ల వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. డిసెంబర్‌లో కేసుల విచారణ వాయిదా పడటంతో ప్రస్తుతానికి సిఎం జగన్ కార్యాలయం మాత్రమే విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది.
జమిలీ ఎన్నికలకు రెడీ….
క్యాబినెట్ భేటీలో జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రి వర్గ సహచరులకు సిఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు ఎన్నిలకు సిద్ధమవ్వాలని సిఎం మంత్రులకు సూచించారు.
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులంతా తప్పనిసరిగా రావాలని సిఎం ఆదేశించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో విపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టాలని సూచించారు. చంద్రబాబు అవినీతిని సభ సాక్షిగా ఎండగట్టాలని మంత్రులకు సిఎం సూచించారు.