CM Jagan : భూ వివాదాలకు చెక్ పెడతాం.., అలా చేస్తే చంద్రబాబు అంటారు
CM Jagan On Land Survey : భూ వివాదాలన్నింటికీ చెక్ పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలో అత్యాధునిక సాంకేతికతతో భూముల సర్వే నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.
రాజకీయాలంటే.. జవాబుదారీతనమని సీఎం జగన్(CM Jagan) అన్నారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు(Bhu Hakku) పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు మంచి చేస్తే ఆదరిస్తారని అన్నారు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని వ్యాఖ్యానించారు. మీ ఇళ్లలో మంచి జరిగితే మీ బిడ్డకు అండగా ఉండాలని కోరారు.
'2023 చివరి నాటికి రాష్ట్రమంతా భూ సమగ్ర సర్వే(Bhu Samagra Survey) పూర్తిచేస్తాం. భూవివాదాల్లో ఎక్కువ సివిల్ కేసు(Civil Case)లే. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు(Farmers) నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలి. అందుకే సర్వే చేపట్టాం. రాష్ట్రం మొత్తం భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్ చేశాం. ప్రతి కమతానికి గుర్తింపు సంఖ్య ఇస్తాం. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం అందిస్తాం. ఆధునిక టెక్నాలజీ(Technology) సాయంతో భూసర్వే చేపడుతున్నాం. 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో(Revenue Villages) భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఇప్పటి వరకూ 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందజేశాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే నిర్వహిస్తాం. మే 2023 కల్లా 6 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు, ఆగస్టు 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం.' అని సీఎం జగన్ చెప్పారు.
వైఎస్ఆర్సీపీ(YSRCP) అధికారంలోకి వచ్చినాక.. పాలన వ్యవస్థలో మార్పులు తెచ్చామని జగన్ అన్నారు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామన్నారు. కుప్పంతోపాటుగా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు(Revenue Divisions) ఏర్పాటు అయ్యాయని తెలిపారు. మూడు ప్రాంతాలు బాగుపడలానేదే తమ ఉద్దేశమని.., అందుకే మూడు రాజధానులు(Three Capitals) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. టీడీపీ(TDP) హయాంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నట్టుగా చెప్పారు.
సమావేశంలో భాగంగా చంద్రబాబు(Chandrababu)పై జగన్ విమర్శలు గుప్పించారు. తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే.. ఎంజీఆర్(MGR), ఎన్టీఆర్(NTR), జగన్ అంటారని, కుమార్తెనిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే.. చంద్రబాబు అంటారని విమర్శించారు. ‘ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారు. మోసం చేసే చంద్రబాబులాంటి వ్యక్తులు మళ్లీ అధికారం రాకూడదు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడంటారు. పరాయి స్త్రీ మీద కన్నేసి అపహరిస్తే రావణుడు అంటారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నాం. దుర్యోధనుడులాంటి చంద్రబాబును సమర్థించే వారిని దుష్టచతుష్టయం అంటారు. మామకు వెన్నుపోటు పొడిచి సీఎం(CM) కుర్చీని లాక్కున్నారు.’ అని జగన్ విమర్శలు చేశారు.
సంబంధిత కథనం