CM Jagan - CM Revanth : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం - సీఎం జగన్ అభినందనలు, ఏమన్నారంటే...
CM Jagan On Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన వేళ… పలువురు అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ కూడా ట్వీట్ చేశారు.
CM Jagan On Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. గురువారం ఎల్బీ స్టేడియంలో మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేసిన వేళ… పలువురు ప్రముఖలు అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం జగన్ కూడా విషెష్ చెప్పారు.
సీఎం జగన్ అభినందనలు
“తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ 'X'లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి జగన్.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు "తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రి వర్గ సహచరులకు శుభాభినందనలు. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నేరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి’’ అని ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీ అభినందలు
‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హమీ ఇస్తున్నా’’ అని ప్రధాని తన X(ట్విట్టర్)లో పోస్టు చేశారు.