Delhi Tour : ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు-cm jagan and chandrababu attends g20 all party meet summit in delhi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cm Jagan And Chandrababu Attends G20 All Party Meet Summit In Delhi

Delhi Tour : ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 10:59 PM IST

Jagan and Chandrababu : సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరవుతారు.

చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)

2022 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 వరకూ జీ 20(G 20) దేశాల కూటమికి భారతదేశం(India) అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని విజయవంతం చేసేందుకు.. కేంద్రం అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మోదీ(Modi) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. దీని కోసం అన్ని పార్టీల అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. సోమవారం సాయంత్రం.. 5 గంటలకు సదస్సు జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

భారత్​లో నిర్వహించే గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G -20) భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల(Political Parties) అధ్యక్షులతో ప్రధాని చర్చిస్తారు. రాష్ట్రపతి భవన్​లో సోమవారం సాయంత్రం 5 గంటలకు సదస్సు ఉంటుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా.. సీఎం జగన్(CM Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఆహ్వానం అందింది. సోమవారం సీఎం జగన్ దిల్లీ బయలుదేరి వెళ్తారు. జీ-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ సమావేశానికి వెళ్తున్నారు. ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్(Hyderabad)లోని తన నివాసం నుంచి చంద్రబాబు దిల్లీ బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుని.. రాత్రి 7 గంటల వరకు అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత హాజరుకానున్న సమావేశం కావడంతో ఏపీలో ఆసక్తి నెలకొంది.

ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న జీ 20 దేశాలకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత్ నేతృత్వం వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి.. వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు.

IPL_Entry_Point