Chandrababu: కక్ష సాధింపు కోసం ప్రజలు గెలిపించ లేదు… సూపర్ సిక్స హామీలు అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు
Chandrababu: 2024లో ప్రజలు ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని కక్ష సాధింపుల కోసం తమను గెలిపించ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు ధ‌్వంసం అయ్యాయని వాటిని సరి చేసుకోవాల్సి వస్తోందన్నారు.
Chandrababu: 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారని, సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తామని, టీడీపీ క్యాడర్ అభిప్రాయాలు ఎలా ఉన్నా కక్ష సాధింపుల కోసం ప్రజలు తమకు అధికారాన్ని ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాది మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలపై చర్చించారు. ఐదేళ్ల పాటు అన్ని వ్యవస్థల్లో విధ్వంసం చేశారని, గత ప్రభుత్వ పాలన నేరాలు, ఘోరాలకు అడ్రస్‌గా మారిందన్నారు. ప్రభుత్వం ముందు ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని ఒక్కోటి విప్పుకుంటూ అభివృద్ధితో ముందువెళ్తున్నామన్నారు.
1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారని, జగన్ మాదిరి తాను కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టత ఇచ్చారు. అలా చేసి ఉంటే సీఎం అయిన వెంటనే జైల్లో పెట్టేవాళ్ళమన్నారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టమనిఅందరి సంగతి ఒకేసారి చూడాలి అంటే కుదరదన్నారు. తప్పును వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
94 కేంద్ర పథకాలకు గాను 74 పథకాలు సరి చేశానని, అప్పులకు ఎఫ్‌ఆర్‌బిఎం వల్ల అవకాశం రాలేదన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు..వచ్చే రెండేళ్ల వి కూడా వాడేశారని చెప్పారు. గత ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్,మైన్స్‌లో అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని కొద్దిగా గాడిలో పెట్టామన్నారు.
ఏపీలో 64 లక్షల మందికి..34 వేల కోట్ల పెన్షన్ ఇస్తున్నామని, సంక్షేమం..అభివృద్ధి కి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని వెల్ఫేర్ లైన్ లోకి తెచ్చామని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేంద్రాన్ని నిధులు అడుగుతున్నామని విరించారు. ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చాక అధికారులు అది అమలు చేయాల్సిందేనని, రాష్ట్రంలో సోషల్ మీడియా తప్పుడు పోస్టులు తగ్గాయని అభిప్రాయపడ్డారు.
వ్యవస్థల్ని గాడిన పెడుతున్నా…
జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎంతో భరోసా కలిగిందన్నారు. జగన్ అరాచక విధానాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను సమస్యల వలయంలో నెట్టివెళ్లాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లకుపైగా ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు.
ఉన్మాదంతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కట్టడి చేస్తున్నామని సమస్యల సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేందుకు ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయని వాటిని సరిచేసేందుకు ఆరు నెలల పాటు కసరత్తు చేశామన్నారు. గత ఐదేళ్ల పాలన నేరాలు ఘోరాలకు అడ్రస్‌గా మారిందని కూటమి ప్రభుత్వం రాగానే శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేస్తూ నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు
‘1995లో సీఎంగా నా పనితీరు చూశారు. ఇక ముందుకు కూడా ఆనాటి సీఎంను చూస్తారు. సోషల్ మీడియాలో ఇదివరకు లాగా ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సెకీ ఒప్పందం మాకు లడ్డూలా దొరికిన విషయం వాస్తవమేనని ఆ విషయంలో చట్టం ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
2004లో నన్ను ఎవరూ ఓడించలేదని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినా, చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. ఈ సారి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ... ప్రజలను నాతోపాటే తీసుకెళ్తానన్నారు. ఆరు నెలలల్లో వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గత ప్రభుత్వ హయాంలో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రాలేదన్నారు.
ఇచ్చిన హామీలైన సీపీఎస్ రద్దు, మద్య నిషేధం అమలు చేస్తామని అబద్ధాలు చెప్పాడని అధికారంలోకి వచ్చాక నాకు తెలియదు, ఇంత ఖర్చు అవుతుందని అనుకోలేదు అంటూ మాట మార్చారని ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. తాము మాత్రం ఇచ్చిన సూపర్ 6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.