CBN in Anakapalle: ఎసెన్షియా ఫార్మా పేలుడు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, మృతులకు కోటి రుపాయల పరిహారం..-cm chandrababu visited the victims of anacapalli escientia pharma blast ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Anakapalle: ఎసెన్షియా ఫార్మా పేలుడు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, మృతులకు కోటి రుపాయల పరిహారం..

CBN in Anakapalle: ఎసెన్షియా ఫార్మా పేలుడు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, మృతులకు కోటి రుపాయల పరిహారం..

Sarath chandra.B HT Telugu
Aug 22, 2024 01:30 PM IST

CBN in Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీ పేలుడు బాధితుల్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. మెడీకవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి కోటి రుపాయల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షల పరిహారం ప్రకటించారు.

అనకాపల్లి ఫార్మా కంపెనీ పేలుడు బాధితుల్ని పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు
అనకాపల్లి ఫార్మా కంపెనీ పేలుడు బాధితుల్ని పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు

CBN in Anakapalle: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీ పేలుడు బాధితుల్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి కోటి పరిహారం చెల్లిస్తామని ఎక్స్‌లో చంద్రబాబు ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.25లక్షల పరిహారం ప్రకటించారు.

ఎసెన్షియాలో జరిగిన పేలుడులో గాయపడి విశాఖపట్నం మెడీకవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖర్చుకు వెనకాడకుండా చికిత్స చేయాలని, కోలుకున్నాక శస్త్ర చికిత్సలు చేయాలన్నారు. ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరిని కాపాడాలని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. క్షతగాత్రుల్ని పరామర్శించిన తర్వాత బాధిత కుటుంబాలను చంద్రబాబు ఓదార్చారు.

గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్ష వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఎవరు ఏడుస్తూ అధైర్య పడొద్దని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు అండగా ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చిన తాను అండగా ఉంటానని చెప్పారు. బాధితులు కోలుకున్న తర్వాత తాను మళ్లీ వచ్చి పరామర్శిస్తానని చెప్పారు.

ఫార్మా సిటీలో జరిగిన దురదృష్టకరమైన ఘటన అని దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. చాలా బాధించిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థల్ని సర్వ నాశనం చేసిందని, అవన్నీ బాగు చేసే క్రమంలో ఈ ఘటన చాలా బాధించిందన్నారు. 17మంది ప్రాణాలు కోల్పోయారని, 36మంది గాయపడ్డారని, 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయని 26మందికి మైనర్ గాయాలయ్యాయని చెప్పారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడినట్టు చెప్పారు. ఒకరికి 57శాతం కాలిన గాయాలు ఉన్నాయని, క్షతగాత్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారందరికి మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్టు చెప్పారు. నలుగురైదుగురికి తీవ్రంగా కాలిన గాయాలు ఉన్నాయని, బాధితుల్లో ఒకరు తీవ్ర షాక్‌లో ఉన్నారని, వారందరితో మాట్లాడి ధైర్యం చెప్పినట్టు చెప్పారు. వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించటనట్టు చెప్పారు. దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు.

ప్రమాద ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. బాధితుల్ని ఉదారంగా ఆదుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా ఉండాలన్నారు. కంపెనీ యాజమాన్యంలో జరిగిన అవకతవకల్ని గుర్తిస్తామన్నారు.

కంపెనీ వ్యవహారాల్లో లోటుపాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామన్నారు. పరిహారం తాత్కాలికమని, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని,ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫార్మా కంపెనీ ఘటనలో మృతి చెందిన వారికి పరిహారం చెల్లిస్తామన్నారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అనంతరం ప్రమాదం జరిగిన ఎసెన్షియా ప్లాంటును పరిశీలించేందుకు వెళ్లారు.