Anna Canteen : అన్న క్యాంటీన్ లో ఏ రోజు ఏం పెడతారు? మెనూ, లోకేషన్ వివరాలివే
Anna Canteen : ఆగస్టు 15న గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకే పేదలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్/డిన్నర్ అందించనున్నారు. అన్న క్యాంటీన్ల మోను, సమయాల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.
Anna Canteen : ఆగస్టు 15న గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలివిడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అన్న క్యాంటీన్ల మోను వివరాలను ప్రభుత్వం తెలిపింది. రూ.15 చెల్లిస్తే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు అన్న క్యాంటీన్ లో ఆహార పదార్థాలు అందిస్తారు. ఆదివారం సెలవు ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు , లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3.00 వరకు, డిన్నర్ సాయంత్రం 7.30 నుంచి 9.00 వరకు. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ పెడతారు.
అన్న క్యాంటీన్ మెనూ
- సోమవారం - బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ ,చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
- మంగళవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
- బుధవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
- గురువారం- బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
- శుక్రవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
శనివారం- బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
గుంటూరులో అన్న క్యాంటీన్ ను పరిశీలించిన మంత్రి నారాయణ
అన్న క్యాంటీన్లు కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మరికొద్ది గంటల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సిద్దమవుతుందటంతో గుంటూరులో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. చుట్టుగుంటలో ప్రారంభానికి సిద్ధంగా అన్న క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. క్యాంటీన్ భవనం నిర్మాణం, వడ్డించే ప్రాంతం,చేతులు కడుగుకునే ప్రాంతం,అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పరిశీలన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
గత టీడీపీ ప్రభుత్వంలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించామని మంత్రి నారాయణ తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లు రద్దు చేసి ఆ భవనాలను ఇతర అవసరాలకు వినియోగించిందన్నారు మంత్రి. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు...ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు..రేపు సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ లు ప్రారంభించనున్నారన్నారు. గతంలో మాదిరిగానే చక్కటి వాతావరణంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఆగస్టు 15న సీఎం ప్రారంభించిన తర్వాత ఎల్లుండి మిగిలిన మరో 99 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. గుంటూరులో మొత్తం 8 క్యాంటీన్లు ఉండగా వాటిలో ఏడు క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం
ఒక రోజుకు ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి 90 రూపాయలు ఖర్చవుతుందని....15 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తే మిగిలిన 75 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అన్న క్యాంటీన్లుకు విరాళం ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారన్నారు. నిన్న ఒక దాత శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వగా..ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం ఇచ్చారన్నారు. ఈ నిధిని కార్పస్ ఫండ్ గా ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీని క్యాంటీన్ అవసరాలకు వినియోగిస్తామన్నారు. కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతల పేరుతో ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ లకు ఆహారం సరఫరా చేస్తామన్నారు..విరాళం ఇవ్వాలనుకునే దాతలు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనినీ తప్పు పట్టడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి నారాయణ విమర్శించారు. అన్న క్యాంటీన్లలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు..వైసీపీ వాళ్లు రివర్స్ టెండరింగ్ పేరుతో అన్నీ నాశనం చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలను, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచిన పెన్షన్లను పంపిణీ చేసిందన్నారు. పెన్షన్లు కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చవుతుందని అన్నారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని....అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని...త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఒకవైపు హామీలు అమలు చేస్తూ...మరోవైపు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాం...గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. వైసీపీ తీరుతో ఆ పార్టీ నాయకులే విసిగిపోయి టీడీపీ వైపు వస్తున్నారని....దాంట్లో భాగంగానే పలు మున్సిపల్ కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకుంటుందని అన్నారు. గత సీఎం ఎప్పుడూ ప్రజల్లోకి రాలేదని...ఇంట్లోనే ఉండి పాలన సాగించారన్నారు. కానీ ప్రజల్లోనే ఉండాలనేది సీఎం చంద్రబాబు విధానం అన్నారు. అందుకే ఉండవల్లిలో తన నివాసం ఎదురుగానే అన్న క్యాంటీన్ ఉన్నప్పటికీ అక్కడ కాకుండా గుడివాడలో ప్రజల మధ్యలో అన్న క్యాంటీన్ ప్రారంభించాలని సీఎం నిర్ణయించారని మంత్రి నారాయణ అన్నారు.
సంబంధిత కథనం