CM Chandrababu : 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు సీఎం- నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజాసేవ : సీఎం చంద్రబాబు-cm chandrababu naidu says 47 years in politics vows to serve till last breath ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు సీఎం- నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజాసేవ : సీఎం చంద్రబాబు

CM Chandrababu : 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు సీఎం- నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజాసేవ : సీఎం చంద్రబాబు

CM Chandrababu : ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం మార్చి 15న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. 41 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నానన్నారు. తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు సీఎం- నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజాసేవ : సీఎం చంద్రబాబు

CM Chandrababu : పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్ లో చెత్తను తొలగించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యతని సీఎం పిలుపునిచ్చారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..."వేస్ట్ టు ఎనర్జీ కింద, కుళ్లిపోయిన కూరగాయల నుంచి సంపదను సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే, రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాం. రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పనిచేయాలి.

అలాగే, మన ఆరోగ్యం కాపాడుతూ, మన కోసం ఎవరూ చేయని పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు. వారిని మనం సమాజంలో గౌరవించాలి" అన్నారు.

"ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్లు సమైక్యాంధ్ర సీఎంగా, మొత్తంగా 14 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను. ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, తెలుగువారికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పం నాది" -సీఎం చంద్రబాబు

పది లక్షల కోట్ల అప్పు మిగిల్చారు - సీఎం చంద్రబాబు

రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలనతో ముందుకెళ్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎం ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని విమర్శించారు. విమానంలో వస్తూ .... చెట్లను నరికేవాళ్లని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చామన్నారు. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే కూటమి ప్రభుత్వం ఏకైక లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్లిందన్నారు. అప్పు తీర్చడంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.

"గత ప్రభుత్వం కనీసం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదు. వైఎస్ జగన్‌ 45 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే పేదల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం. దివ్యాంగులకు పింఛన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాం. చరిత్రలో తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం అమలుచేస్తున్నాం. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషిచేస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం