CBN In Delhi: ఢిల్లీలో సిఎం చంద్ర బాబు బిజీబిజీ, హోంమంత్రి అమిత్‌షాతో బాబు భేటీ, ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి-cm chandrababu meets home minister amit shah in delhi appeals to support ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Delhi: ఢిల్లీలో సిఎం చంద్ర బాబు బిజీబిజీ, హోంమంత్రి అమిత్‌షాతో బాబు భేటీ, ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి

CBN In Delhi: ఢిల్లీలో సిఎం చంద్ర బాబు బిజీబిజీ, హోంమంత్రి అమిత్‌షాతో బాబు భేటీ, ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి

Sarath chandra.B HT Telugu
Jul 17, 2024 06:25 AM IST

CBN In Delhi: ఏపీ సిఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ

CBN In Delhi: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విభజన హామీలు, అమలు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చించారు. దాదాపు గంటకు పైగా బాబు, అమిత్ షా భేటీ కొనసాగింది.

yearly horoscope entry point

ఏపీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఇతోదికంగా సాయం చేయాలని చంద్రబాబు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. జూలై 23న పార్లమెంటులో ప్రవే శపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం అందించాలని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి 9 గంటలకు కృష్ణమీనన్ మార్గ్‌లోని హోం మంత్రి నివాసంలో సిఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.

చంద్రబాబుతోపాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నా యుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున, ఆ పరిస్థితి నుంచి గట్టెక్క డానికి రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో హామీల అమలు, ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంబన నెలకొన్న అంశాలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని నగరంగా మిగిలిపోయిందని, ఐదేళ్లుగా అమరావతి నిర్మాణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని బాబు లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులను మరమ్మతు చేసేందుకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని వీటిని బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరారు.

చంద్రబాబు ట్వీట్…

అమిత్‌షాతో భేటీ తర్వాత సిఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 'ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ దెబ్బతిన్న వైనం, రాష్ట్రంలో తలెత్తిన విధ్వంసక పరిస్థితుల గురించి తెలియజేయడానికి హోం మంత్రి అమిత్ షాను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల్లోని అంశాలపై చర్చించామని, 2019-24 మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన అప్పుల భారం, దానివల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిపోయిన విషయాన్ని వివరించానని తెలిపారు.

గత ప్రభుత్వ చేతగానితనం, దుష్పరిపాలన, విపరీతమైన అవినీతి కారణంగా రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, ఎన్డీయే కూటమికి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టిన విజయాన్ని గౌరవిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కిస్తామని, కలిసి కట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

Whats_app_banner