AP Schools Holiday : భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీలో విద్యాసంస్థలకు సెలవు
AP Schools Holiday : ఏపీ వ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత రెండు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటి మునిగాయి. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
AP Schools Holiday :రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు తగ్గాయని, కానీ వరద ముంపు పొంచి ఉందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించాలన్నారు. ఆదేశాలను పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలు నీటి మునిగాయి. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు రేపు(సోమవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం అవసరమైతే హెలీకాప్టర్లు పంపుతామన్నారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు బాధితులకు ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
20 సెంటీ మీటర్ల వర్షపాతం
రాష్ట్రంలోని 14 నియోజకవర్గాల్లో 20 సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని సీఎం అన్నారు. వత్సవాయి, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో 30 శాతం వర్షపాతం రికార్డైందన్నారు. జాతీయ రహాదారులపైకి నీరు చేరి ట్రాఫిక్ స్తంభించిందన్నారు. ప్రభుత్వం రెగ్యులర్ మానిటరింగ్ చేస్తుందన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో 9 మరణాలు సంభవించాయని, ఇది దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయన్నారు.
నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపై నీటికి బయటకు పంపడమే కాదు....కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం గత రెండు రోజుల్లో పడిందన్నారు.
తెలంగాణ విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సెప్టెంబర్ 2 సోమవారం నాడు సెలవు ప్రకటిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తొలుత హైదరాబాద్ నగరంలోని విద్యా సంస్థలకే సెలవు ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది.