Psychology Courses: ఏపీలో త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభం, ఎంఫిల్‌, ప్రొఫెషనల్ డిప్లొమా కొోర్సులు సిద్ధం-clinical psychology courses to start soon in ap mphil and professional diploma courses ready ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Psychology Courses: ఏపీలో త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభం, ఎంఫిల్‌, ప్రొఫెషనల్ డిప్లొమా కొోర్సులు సిద్ధం

Psychology Courses: ఏపీలో త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభం, ఎంఫిల్‌, ప్రొఫెషనల్ డిప్లొమా కొోర్సులు సిద్ధం

Psychology Courses: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొట్ట‌మొద‌టి సారిగా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సుల్ని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య రంగానికి ఎంతో ముఖ్య‌మైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కోర్సుల్ని త్వరలో ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో క్లినికల్ సైకాలజీ కోర్సులు

Psychology Courses: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారి క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో క్లినికల్ సైకాలజీ కోర్సులు అందుబాటులో లేవు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మ‌రియు చికిత్స అందించ‌డంలో క్లినికల్ సైకాలజిస్టులు కీల‌క పాత్ర వ‌హిస్తారని, వారి అవసరాన్ని గుర్తించి క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ వివరించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సుల్ని ప్రారంభించ‌నున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నట్టు తెలిపారు. వైద్య రంగానికి ఎంతో ముఖ్య‌మైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌వేశ పెట్ట‌క‌పోవ‌డం దుర‌దృష్టమన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మ‌రియు చికిత్స అందించ‌డంలో క్లినికల్ సైకాలజిస్టులు కీల‌క పాత్ర వ‌హిస్తారు.

అన్ని ర‌కాల రోగులు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవ‌డం(రిహేబిలిటేష‌న్‌)లో కూడా ప్ర‌ధాన భూమిక వ‌హిస్తారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినిక‌ల్ సైకాల‌జిస్టులు దాదాపు లేరు. రాష్ట్రంలోనే కాక దాదాపు అన్ని చోట్లా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సులు నిర్వ‌హించక పోవ‌డంతో వారి కొరత ఉంది.

క్ర‌మేపీ పెరుగుతున్న మాన‌సిక స‌మ‌స్య‌లు, క్లినిక‌ల్ సైకాల‌జిస్టుల లోటును దృష్టిలో పెట్టుకుని అతి త్వరలో రెండేళ్ల వ్య‌వ‌ధితో కూడిన ఎం.ఫిల్ మరియు ఒక ఏడాదిపాటు సాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సుని ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

ఈ రెండు కోర్సుల్ని వీలైనం త్వరగా ప్రారంభించేందుకు వీలుగా మార్గదర్శకాల్ని త‌యారు చేయాల‌ని అధికారుల్ని ఆదేశించినట్టు మంత్రి వివరించారు. క్లినికల్ సైకాలజీ విద్య‌ను నియంత్రించే రిహాబిలిటేష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో సంప్ర‌దింపులు చేసి ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఈ కోర్సుల్ని రాష్ట్రంలో త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని తెలిపారు.