Chittoor Jobs : చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 26 కాంట్రాక్టు ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి-chittoor women child welfare department 26 contract posts notification application process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chittoor Jobs : చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 26 కాంట్రాక్టు ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి

Chittoor Jobs : చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 26 కాంట్రాక్టు ఉద్యోగాలు-ఇలా దరఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 02:22 PM IST

Chittoor Jobs : చిత్తూరు జిల్లా పరిధిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 26 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుకు ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించారు.

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 26 కాంట్రాక్టు ఉద్యోగాలు
చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో 26 కాంట్రాక్టు ఉద్యోగాలు

Chittoor Jobs : చిత్తూరు జిల్లా ప‌రిధిలోని మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యం, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాల‌యాల్లో ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆగ‌స్టు 10 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు కోరుతున్నారు.

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని ఖాళీగా ఉన్న 26 ఉద్యోగాల‌కు అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా పీడీ నాగ‌శైల‌జ కోరారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కాంట్రాక్టు పద్ధతిలో భ‌ర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్నారు. ఇందులో అర్హులైన అభ్యర్థుల‌కు మాత్రమే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూలు నిర్వహించి నియామ‌కం జ‌రుపుతారు. అయితే ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం కంప్యూట‌ర్ ప‌రీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా నియామం చేస్తారు. ద‌ర‌ఖాస్తు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://chittoor.ap.gov.in/ ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. అనంత‌రం సంబంధిత స‌ర్టిఫికేట్లను జ‌త‌చేసి, ఆగ‌స్టు 10 సాయంత్రం 5 గంట‌ల లోపు చిత్తూరు క‌లెక్టరేట్‌లోని స్త్రీ, శిశు సంక్షేమ కార్యాల‌యంలో అంద‌జేయాలి.

పోస్టులు...రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీలు...జీతం

జిల్లా కో ఆర్డినేట‌ర్‌, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, కుప్పం బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్, శాంతిపురం బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్, ప‌ల‌మ‌నేరు బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్, బంగారు పాళ్యం బ్లాక్ ప్రాజెక్టు కో ఆర్డినేట‌ర్, బైరెడ్డిప‌ల్లె బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్, పుంగ‌నూరు బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తునున్నట్లు తెలిపారు. ఇందులో మూడు శాంతిపురం బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ (ఓసీ), పుంగ‌నూరు బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ (ఓసీ), ప‌ల‌మ‌నేరు బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ (ఓసీ) కేట‌గిరీ కాగా, కుప్పం బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ (ఎస్‌టీ), బంగారు పాళ్యం బ్లాక్ ప్రాజెక్టు కో ఆర్డినేట‌ర్ (ఎస్‌సీ), బైరెడ్డిప‌ల్లె బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ (బీసీ-ఏ) కేట‌గిరీల్లో ఉన్నాయి.

జిల్లా కో ఆర్డినేట‌ర్ (1)

జిల్లా కో ఆర్డినేట‌ర్ వేత‌నం నెల‌కు రూ.30,000 ఉంటుంది. ఈ పోస్టుకు వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్లు ఉండాలి. దీనికి అర్హ‌త డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్‌లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. స్థానిక భాష‌లో మంచిగా రాయ‌గ‌ల‌గాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. స్థానిక అభ్య‌ర్థి అయి ఉండాలి.

జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ (1)

జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేత‌నం నెల‌కు రూ.18,000 ఉంటుంది. ఈ పోస్టుకు వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్లు ఉండాలి. దీనికి అర్హ‌త డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్‌లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. స్థానిక భాష‌లో మంచిగా రాయ‌గ‌ల‌గాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. స్థానిక అభ్యర్థి అయి ఉండాలి.

బ్లాక్ కోఆర్డినేట‌ర్ పోస్టులు (6)

బ్లాక్‌ కోఆర్డినేట‌ర్ల వేత‌నం నెల‌కు రూ.20,000 ఉంటుంద‌ని తెలిపారు. ఈ పోస్టుకు వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుంచి 42 ఏళ్లు ఉండాలి. దీనికి అర్హ‌త డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే పోస్టు గ్రాడ్యూట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌, సోష‌ల్ సైన్స్‌స్, న్యూట్రిష‌న్‌, సూప‌ర్ వైజ‌ర్ స్కిల్స్‌లో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి. స్థానిక భాష‌లో మంచిగా రాయ‌గ‌ల‌గాలి, అలాగే ఇంగ్లీష్ భాష‌పై కూడా ప‌ట్టు ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. స్థానిక అభ్య‌ర్థి అయి ఉండాలి.

చిత్తూరు జిల్లా బాల‌ల ప‌రిర‌క్షణ విభాగంలో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో కౌన్సిల‌ర్‌, ప్రొటెక్షన్ ఆఫీస‌ర్‌, సోష‌ల్ వ‌ర్కర్, డేటా అన‌లిస్ట్‌, పార్ట్‌టైం డాక్టర్‌, ఔట్‌రీచ్ వ‌ర్కర్‌, అకౌంటెంట్‌, పారా లీగ‌ల్ ప‌ర్సన‌ల్, పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్‌, సోష‌ల్ కౌన్సెల‌ర్‌, ఆఫీస్ అసిస్టెంట్, వ‌న్ స్టాప్ స‌ఖీ కేంద్రంలో ఖాళీగా ఉన్న సెంట‌ర్ అడ్మినిస్ట్రేట‌ర్ ఒక్కో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆశా (ఓసీ-1, ఎస్‌సీ-1), మ‌ల్టీ ప‌ర్పస్ స్టాఫ్ (ఓసీ-1, ఎస్‌సీ-1), సెక్యూరిటీ గార్డులు (ఓసీ-1, ఎస్‌సీ-1) రెండేసి చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చిత్తూరు జిల్లా పీడీ నాగ‌శైల‌జ తెలిపారు. ఇందులో స‌ఖీ కేంద్రంలోని పోస్టుల‌కు మ‌హిళ‌లు మాత్ర‌మే అర్హులని, అర్హులైన మ‌హిళ‌లు మాత్ర‌మే ఆ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు.

సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేట‌ర్ (మ‌హిళ‌-1)

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్‌కు నెల‌కు వేత‌నం రూ.34,000 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. లా, సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, సోష‌ల్ సైన్స్‌, సైకాల‌జీల్లో పీజీ చేసి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. క‌నీసం ఏడాదిపాటు కౌన్సిలింగ్‌లో అనుభ‌వం ఉండాలి. స్థానిక అభ్యర్థి అయి ఉండాలి.

పారా లీగ‌ల్ ప‌ర్స‌న‌ల్, లాయ‌ర్ (1)

పారా లీగ‌ల్ ప‌ర్స‌న‌ల్, లాయ‌ర్‌కు నెల‌కు వేత‌నం రూ.20,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. లాలో డిగ్రీ చేసి ఉండాలి. క‌నీసం మూడేళ్లు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ప్రాజెక్టుల్లో అనుభ‌వం ఉండాలి. . రెండేళ్లు జిల్లా స్థాయి కోర్టులో ప్రాక్టీస్ చేసిన అనుభ‌వం ఉండాలి.

పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్ (మ‌హిళ‌-1)

పారా మెడిక‌ల్ ప‌ర్సన‌ల్‌కు వేత‌నం నెల‌కు రూ.19,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. పారా మెడిక‌ల్‌లో ప్రొఫెస‌న‌ల్ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టుల్లో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

సోష‌ల్ కౌన్సెల‌ర్ (మ‌హిళ‌-1)

సోష‌ల్ కౌన్సెల‌ర్‌కు వేత‌నం నెల‌కు రూ.20,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సైకాల‌జీ, న్యూరోసైన్స్ లో ప్రొఫెస‌న‌ల్ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్టుల్లో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

ఆఫీస్ అసిస్టెంట్ (మ‌హిళ-1)

ఆఫీస్ అసిస్టెంట్‌కు నెల‌కు వేత‌నం రూ.19,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. దీనికి అర్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. డేటా మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

మ‌ల్టీ ప‌ర్పస్ స్టాఫ్ (మ‌హిళ‌-2 ఓసీ-1, ఎస్‌సీ-1),

మ‌ల్టీ ప‌ర్పస్ స్టాఫ్‌కు నెల‌కు వేత‌నం రూ.13,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. హైస్కూల్ పాస్ ఉండాలి. ప‌రిజ్ఞానం, అనుభ‌వం ఉండాలి.

సెక్యూరిటీ, నైట్‌ గార్డులు (మ‌హిళ‌-2 ఓసీ-1, ఎస్‌సీ-1)

సెక్యూరిటీ, నైట్‌ గార్డుల వేత‌నం నెల‌కు రూ.15,000 ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సెక్యూరిటీగా రెండేళ్ల అనుభవం ఉండాలి.

ప్రొటెక్షన్ ఆఫీస‌ర్ (1)

ప్రొటెక్షన్ ఆఫీస‌ర్ నెల వేత‌నం రూ.27,804 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, హుమ‌న్ రైట్స్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, సైకాల‌జీ, లా, ప‌బ్లిక్ హెల్త్‌, క‌మ్యూనిటీ రిసోర్స్‌స్‌, మేనేజ్‌మెంట్ పీజీ చేసి ఉండాలి. లేక‌పోతే వీటిల్లో డిగ్రీ చేయాలి, రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

కౌన్సిల‌ర్ (1)

కౌన్సిల‌ర్ వేత‌నం నెల‌కు రూ.18,536 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, సైకాల‌జీ, ప‌బ్లిక్ హెల్త్‌, కౌన్సిలింగ్‌లో డిగ్రీ చేయాలి. పీజీ డిప్లొమా చేసి ఉండాలి. క‌నీసం ఏడాది అనుభవం ఉండాలి.

సోష‌ల్ వ‌ర్కర్ (1)

సోష‌ల్ వ‌ర్క‌ర్ వేత‌నం నెల‌కు రూ.18,536 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, సోష‌ల్ సైన్స్‌లో డిగ్రీ చేయాలి. ప‌ని అనుభ‌వం ఉన్న‌వాళ్ల‌కు వెయిటేజ్ ఉంటుంది.

అకౌంటెంట్ (1)

అకౌంటెంట్ వేత‌నం నెల‌కు రూ.18,536 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కామ‌ర్స్‌, మాథ్యామెటిక్స్‌, ఎకాన‌మిక్స్‌, కంప్యూట‌ర్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి. ప్రొఫెస‌నల్ అనుభ‌వం ఉండాలి.

డేటా అన‌లిస్ట్ (1)

డేటా అన‌లిస్ట్ వేత‌నం నెల‌కు రూ.18,536 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. స్టాట‌స్టిక్స్‌, మాథ్యామెటిక్స్, ఎకనామిక్స్‌, కంప్యూట‌ర్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి. ప్రొఫెస‌నల్ అనుభ‌వం ఉండాలి.

ఔట్‌రీచ్ వ‌ర్కర్ (1)

ఔట్‌రీచ్ వ‌ర్కర్ వేత‌నం నెల‌కు రూ.10,592 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసి ఉండాలి. స్కిల్ ఉన్న‌వారికి వెయిటేజ్ ఉంటుంది.

ఆశ (మ‌హిళ‌-2 ఓసీ-1, ఎస్‌సీ-1)

ఆశ‌ల వేత‌నం నెల‌కు రూ.7,944 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. చిన్నారుల కేర్ టేక‌ర్‌గా అనుభ‌వం ఉండాలి.

పార్ట్‌టైం డాక్టర్‌

పార్ట్‌టైం డాక్ట‌ర్ వేత‌నం నెల‌కు రూ.9,930 ఉంటుంది. వ‌యోప‌రిమితి 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. క‌నీసం ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం