Chiranjeevi Comments : తమ్ముడికే నా మద్దతు.. పవన్ కోసమే పాలిటిక్స్ నుంచి తప్పుకొన్నా
Chiranjeevi On Pawan Politics : పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ కామెంట్స్ చేసింది లేదు. కానీ తాజాగా గాడ్ ఫాదర్ ప్రీరిలీస్ సమావేశం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
రాజకీయంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కే తన మద్దతు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పష్టం చేశారు. జనసేన పార్టీపై మెుదటిసారిగా స్పందించారు. బహిరంగంగా తనకు తమ్ముడి పార్టీపై ఉన్న అభిప్రాయాన్ని చిరంజీవి చెప్పారు. పవన్ కల్యాణ్ అంకితభావం కలిగిన నాయకుడని చిరంజీవి అన్నారు. అలాంటి నేత రాష్ట్రానికి అవసరమని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో తన మద్దతు తప్పనిసరిగా పవన్‌కే ఉంటుందని స్పష్టం చేశారు.
సినిమా(Cinema)లో ప్రస్తుత రాజకీయ(Politics) నేతలపై ఎలాంటి సెటైర్లు వేయలేదని చిరంజీవి స్పష్టం చేశారు. కథ ఆధారంగానే డైలాగులు ఉన్నాయన్నారు. ఆ డైలాగ్స్ విని ఎవరైనా భుజాలు తడుముకుంటే దానికి తాను ఏం చేయలేనని పేర్కొన్నారు. 'భవిష్యత్‌లో నా మద్దతు తమ్ముడు పవన్‌కు ఉంటుంది. అంకితభావం కలిగిన నేత ఏపీకి అవసరం. ప్రజలు పవన్‌కు అవకాశం ఇస్తారని అనుకుంటున్నా.' అని చిరంజీవి అన్నారు.
'గాడ్ ఫాదర్ సినిమా(Godfather Movie)లో ప్రస్తుత రాజకీయాలపై ఎలాంటి సెటైర్లు వేయలేదు. మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్. ఆ సినిమాలో ఉన్న వాటినే యథాతథంగా తీసుకున్నాం. అందులోని కథ ఆధారంగానే డైలాగులు రాశాం. ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేయలేదు. ఎలాంటి డైలాగులైనా ఎవరైనా అన్వయించుకుని భుజాలు తడుముకుంటే దానికి నేనేం చేయలేను.' అని చిరంజీవి అన్నారు.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిబద్దత, నిజాయితీ తనకు తెలుసని చిరంజీవి అన్నారు. పవన్ విషయంలో ఎక్కడా పొల్యూట్ కాలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయం, ప్రజలు ఎలా ఆదరరిస్తారనేది భవిష్యత్‌లో తెలుస్తుందన్నారు. ఏపీకి పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధతత ఉన్న నేత రావాలనేది ఆకాంక్ష అని చిరంజీవి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ చేసే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందన్నారు.
'పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ(Political Party) పెట్టిన తర్వాత నేను మరో పార్టీలో ఉండటం సరికాదు. పవన్ మరో పక్కన ఉండటంతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. అందుకోసమే నేను విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయిపోయా. అలా అయితేనే పవన్ కల్యాణ్ ఎమర్జ్ అవుతాడు. పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో ప్రజలను పరిపాలించే అవకాశాన్ని కల్పిస్తారని అనుకుంటున్నా. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా.' అని చిరంజీవి స్పష్టం చేశారు.