Chiranjeevi Wishes: సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు విశ్వంభర చిత్ర యూనిట్‌తో చిరంజీవి అభినందనలు
Chiranjeevi Wishes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్తగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కందుల దుర్గేష్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
Chiranjeevi Wishes: ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఏపీ క్యాబినెట్‌లో మంత్రిగా కందుల దుర్గేష్‌కు చోటు దక్కింది. జనసేన తరపున ఎన్నికైన 21మంది శాసన సభ్యుల్లో నలుగురికి మంత్రి పదవులు దక్కాయి.
ప్రస్తుతం విశ్వంభర చిత్ర షూటింగ్‌లో ఉన్న చిరంజీవిని మంత్రి హోదాలో దుర్గేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
'విశ్వంభర' సెట్స్ షూటింగ్‌లో ఉన్న చిరంజీవి యూనిట్ సభ్యులతో కలిసి మంత్రికి స్వాగతం పలికారు. కందుల దుర్గేష్‌కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని అకాంక్షలు వ్యక్తం చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని దుర్గేష్ చిరంజీవికి చెప్పారు. సినీ పరిశ్రమపై దుర్గేష్ సానుకూలతకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.