CBN Kuppam Tour: నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
CBN Kuppam Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. సొంత నియోజక వర్గంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 8వ తేదీన విశాఖపట్నంకు కుప్పం నుంచి బయల్దేరి వెళ్తారు.
CBN Kuppam Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు, రేపు కుప్పం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో స్వర్ణ కుప్పం 2029 డాక్యుమెంట్ విడుదల చేస్తారు. అనంతరం కుప్పం మండలం, నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కుప్పం నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో నూరు శాతం సోలార్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు.
6వ తేదీ సాయంత్రం సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి అవుతారు. రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు.
7వ తేదీ కార్యక్రమాల వివరాలు
7వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలుస్తారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.* సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.