Budameru Victims: వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు, సాయాన్ని ఇలా అందించ వచ్చు…
Budameru Victims: వరదలతో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజులుగా వరదముంపులో చిక్కుకుని,సర్వం కోల్పోయిన వారికి సహాయ చర్యలు అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.దాతలు విరాళాలను అందించేందుకు బ్యాంకు ఖాతాలను ప్రకటించారు.
-Budameru Victims: వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన అనేకమంది విరాళాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు.
దాతలు విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతా నెంబర్ ను, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
వీటి ద్వారా ఎవరైనా సహాయం అందించి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవచ్చు.
బ్యాంకు ఖాతా వివరాలు:
SBI
A/c name : CMRF
A/c number : 38588079208
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : SBIN0018884
Union Bank of India
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : UBIN0830798.
.........
CSR (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద విరాళాలు అందించాలనుకుంటే..
SBI
- A/C name: Andhrapradesh state Disaster Management.
- A/C number: 00000036897128069.
- Branch: MG Road, Vijayawada.
- IFSC code: SBIN 0016857.
అదేవిధంగా Chief Minister's Relief Fund Andhrapradesh కు చెక్కుల ద్వారా కూడా సహాయం అందించవచ్చు.
వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందించారు.
1. బీఎస్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ.1 కోటి
2. సినీ నిర్మాత అశ్వనీదత్ రూ.25 లక్షలు
3. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.25 లక్షలు (విజయవాడ)
4. సిద్ధార్థ వాకర్స్ క్లబ్ రూ.5 లక్షలు (విజయవాడ)
5. టీడీపీ మహిళా నాయకురాలు రాయపాటి శైలజ రూ.5 లక్షలు (గుంటూరు)
6. డాక్టర్ ఐ.నలినీ ప్రసాద్ రూ.1 లక్ష (విజయవాడ)
7. పొట్లూరి విజయ్ కుమార్ రూ.1 లక్ష (విజయవాడ)
8. అల్లూరి అచ్యుతరామరాజు రూ.1 లక్ష (కైకలూరు)
9. వల్లభనేని రవి రూ.1 లక్ష విరాళం అందించారు.
ఈ మేరకు సంబంధిత చెక్కులు, నగదును సీఎం చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తమవంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకొని విరాళాలు అందించినందుకు దాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.