AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. తమపై దాడి చేశారంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు-chaos in ap assembly due to protests by tdp members mlas alleging that ycp leaders attacked them ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chaos In Ap Assembly Due To Protests By Tdp Members, Mlas Alleging That Ycp Leaders Attacked Them

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. తమపై దాడి చేశారంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 11:49 AM IST

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పోటీగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది.

స్పీకర్ స్థానం వద్ద నిరసన చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
స్పీకర్ స్థానం వద్ద నిరసన చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

AP Assembly: వాయిదా తీర్మానంపై టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో తలెత్తిన వివాదాం వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణగా మారింది. టీడీపీ సభ్యుల నిరసనకు పోటీగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగిన క్రమంలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపడంతో మొదలైన ఘర్షణ తోపులాటకు దారి తీసింది. . టీడీపీ ఎమ్మెల్యేలకు పోటీగా వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో స్పీకర్‌ సమక్షంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు మీడియా పాయింట్ దగ్గర ఆరోపించారు.

వైసీపీ తీరు గర్హనీయం..అచ్చన్నాయుడు

తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, సీనియర్‌ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైఎస్సార్సీపీ సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 75 ఏళ్ల వయసున్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడి చేశారని ఆరోపించారు.

రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిరసనల్ని నిషేధిస్తూ జారీ చేసిన 'జీవో1 రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినా, దానిని స్పీకర్‌ అంగీకరించలేదని పోడియం దగ్గర నిరసన తెలిపామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. తాము తప్పు చేస్తే స్పీకర్‌ చర్యలు తీసుకుని మమ్మల్ని సస్పెండ్‌ చేయాలని, వైసీపీ నాయకులు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు.

పోడియం వద్దకు వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా వచ్చారని, ఇంత దారుణంగా ప్రత్యక్ష దాడి పాల్పడి, శాసనసభ పరువును వైసీపీ ప్రభుత్వం తీసిందని పోడియం వద్దకు వైకాపా సభ్యులు రావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. శాసనసభ చరిత్రలో ఇది చీకటి రోజు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారనే ఆందోళన అధికార వైసీపీలో ఉందని అచ్చన్నాయుడు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఓటమి నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు ఈ విధంగా దాడి చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభాపతిపై మేము దాడిచేసినట్లు అసత్యాలు చెబుతున్నారని, డోలా బాలవీరాంజనేయ స్వామిపై సుధాకర్‍బాబు దాడిచేశారని, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వెల్లంపల్లి తోసేశారని, శాసనసభలో జరిగిందంతా స్పీకర్‍కు తెలుసని అచ్చన్నాయుడు ఆరోపించారు. సభ లోపలి దృశ్యాలు పరిశీలిస్తే ఎవరు తప్పు చేశారో తెలుస్తుందన్నారు. స్పీకర్ సాక్షిగా మా ఎమ్మెల్యేలపై దాడి చేశారని, స్పీకర్ మినిట్ టు మినిట్ వీడియో బయటకు తీయాలని, సీట్లో కూర్చున్న బుచ్చయ్య చౌదరిపైకి వచ్చి దాడి చేశారని ఆరోపించారు. సభ్యుల ఆందోళన మధ‌్య అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.

వాయిదా తీర్మానం పెట్టినందుకే దాడి... ఎమ్మెల్యే స్వామి

స్పీకర్ సమక్షంలో తనపై దాడి చేశారని, డిచేసిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని, స్పీకర్ పోడియం వద్ద ఉన్న తన మీదకు వద్దకు వచ్చి దాడి చేశారని, దాడి చేసిందిగాక.. మళ్లీ మాపైనే ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కడా కట్ చేయకుండా సభ మొత్తం వీడియో బయట పెట్టాలన్నారు. తాను ఇచ్చిన వాయిదా తీర్మానం కోసం పట్టుపడితే తనపై దాడి చేస్తారా అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రశ్నించారు.

అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజన్న చంద్రబాబు..

మరోవైపు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేలు దాడిచేశారని చంద్రబాబుకు ఫోన్‍లో అచ్చన్నాయుడు వివరించారు. అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటిరోజని, రాష్ట్ర చరిత్రలో సభలో ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ లేదని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతోనే దళిత సభ్యుడు స్వామిపై దాడి చేశారన్నారు. చట్టసభకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా సీఎం జగన్ నిలిచిపోతారని, వైసీపీ సిద్ధాంతమేంటో ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు.

దళితులపై దమనకాండగా అభివర్ణించిన లోకేష్...

ద‌ళితుల‌పై వైసీపీ ద‌మ‌నకాండ అసెంబ్లీలోనూ కొన‌సాగిందని, ద‌ళిత మేధావి, అజాత‌శ‌త్రువు, కొండెపి ఎమ్మెల్యే డాక్ట‌ర్ బాల వీరాంజనేయ స్వామిపై దాడి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కే క‌ళంకమన్నారు. ద‌ళిత ఎమ్మెల్యే డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామిపై దాడి చేయించ‌డం ద్వారా త‌న ప్ర‌యాణం నేరాల‌తోనే, . త‌న యుద్ధం ద‌ళితుల‌పైనే అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి మ‌రోసారి నిరూపించుకున్నారన్నారు.

ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కి నిలువెత్తు సంత‌కంలా నిలిచే సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిపై ప్ర‌జాస్వామ్య దేవాల‌యం అసెంబ్లీలోనే వైసీపీ దాడికి తెగ‌బ‌డ‌టం దారుణమన్నారు. బుచ్చ‌య్య తాత‌పై దాడి దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లోనే బ్లాక్ డే అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని డిమాండ్

మరోవైపు అసెంబ్లీలో స్పీకర్‍పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి దురదృష్టకరమని, టీడీపీ ఎమ్మెల్యే డోలా తనపై దాడి చేశారని సుధాకర్‌ బాబు ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని,దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని,సభలో దాడి చేయించింది చంద్రబాబేనని, టీడీపీ ఎమ్మెల్యేలతో దాడి చేయించారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు, టీడీపీ సభ్యులు స్పీకర్‍ను అవమానించారని - టీడీపీ సభ్యులు తనను దూషించారని మంత్రి నారాయణ స్వామి ఆరోపించారు. టీడీపీ సభ్యులు తనపై దాడి చేశారని, సభాపతిని టీడీపీ సభ్యులు అవమానించారని, టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలి ఎమ్మెల్యే ఎలీజా డిమాండ్ చేశారు.

శా

IPL_Entry_Point