Chandrababu Tour: రేపటి నుంచి రాయల సీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు
Chandrababu Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం నుంచి సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.
Chandrababu Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి బళ్లారికి వెళ్లనున్న చంద్రబాబు బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
బళ్లారి నుంచి రాయదుర్గం వెళ్లనున్న చంద్రబాబు - ‘‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారంటీ’’ కార్యక్రమంలో పాల్గొంటారు. 5, 6, 7 తేదీల్లో రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు సమావేశాలు, రోడ్ షో, సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 8,9 తేదీల్లో కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. ఏపీలో 45 రోజులపాటు చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రతిపక్షాలు సిద్దంగా లేని సమయంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారనే అనుమానంతో అన్ి జిల్లాల్లో పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేసేందుకు బాబు పర్యటిస్తున్నారు.
“బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. 5వ తేదీ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. 5,6,7 తేదీల్లో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు.
8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుంది. మంగళవారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బళ్లారి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు ..అక్కడ తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటనలో పాల్గొంటారు.
బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు పాల్గొంటున్నారు. టీడీపీ మహానాడులో విడుదల చేసిన హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సిద్దమవుతున్నారు.