CBN In Delhi: హస్తినలో చంద్రబాబు, సిఎం హోదాలో ఢిల్లీలో తొలి పర్యటన, మరికాసేపట్లో ప్రధానితో భేటీ-chandrababus first visit to delhi as cm meeting the prime minister shortly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn In Delhi: హస్తినలో చంద్రబాబు, సిఎం హోదాలో ఢిల్లీలో తొలి పర్యటన, మరికాసేపట్లో ప్రధానితో భేటీ

CBN In Delhi: హస్తినలో చంద్రబాబు, సిఎం హోదాలో ఢిల్లీలో తొలి పర్యటన, మరికాసేపట్లో ప్రధానితో భేటీ

Sarath chandra.B HT Telugu
Jul 04, 2024 09:20 AM IST

CBN In Delhi: ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి చంద్రబాబు పర్యటన జరుగుతోంది.

ఢిల్లీలో సిఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఏపీ ప్రజాప్రతినిధులు
ఢిల్లీలో సిఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న ఏపీ ప్రజాప్రతినిధులు

CBN In Delhi: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకురానున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలంటే కేంద్రం నుంచి ఆర్దిక సాయం అవసరం అవుతుంది. దీంతో పాటు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం,విభజన హామీల అమలు, ఆస్తుల విభజన తదితర అంశాలపై ప్రధాని సహకారాన్ని కోరనునున్నారు.

ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తొలి రోజు కీలక భేటీలు ముగిసిన తర్వాత ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముందున్న సవాళ్లను వివరించే అవకాశాలు ఉన్నాయి.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‍తో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యాహ్నం 2.45 గంటలకు హోం మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఉదయం 10.45 గంటలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ అవుతారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జపాన్ రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఢిల్లీలో సిఎంతో పాటు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు.

ఢిల్లీలో తెలంగాణ సిఎం..

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేవంత్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరనున్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా సిఎంతో పాటు ఢిల్లీ వెళ్లారు.

WhatsApp channel