AP Chief Minister Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11.30 తర్వాత చంద్రబాబుతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతో పాటు అమిషా హాజరయ్యారు. చంద్రబాబు ప్రమాణం తర్వాత… పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు కలిపి నాలుగుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రమాణస్వీకార వేడుకకు విశిష్ట అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
టీడీపీకి 21, జనసేనకు 3, బీజేపీ 1 మంత్రి పదువుల కేటాయించారు. ఆయా పార్టీల నుంచి మంత్రులుగా ఎంపికైన వారు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి ), నారా లోకేష్ (కమ్మ), కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ), కొల్లు రవీంద్ర (బీసీ), పి.నారాయణ (కాపు), వంగలపూడి అనిత (ఎస్సీ), నిమ్మల రామానాయుడు (కమ్మ), ఎన్ఎండీ ఫరూక్ (ముస్లీం), ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి), పయ్యావుల కేశవ్ (కమ్మ), అనగాని సత్యప్రసాద్ (బీసీ), కొలుసు పార్థసారధి (బీసీ), డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ), గొట్టిపాటి రవి (కమ్మ), గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ), బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి), టీజీ భరత్ (వైశ్య), ఎస్.సవిత (బీసీ), వాసంశెట్టి సుభాష్ (బీసీ), కొండపల్లి శ్రీనివాస్ (బీసీ), మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రెడ్డి) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
టీడీపీలో సామాజిక కూర్పు చూస్తే 21 మందిలో ఐదుగురు కమ్మ, ఒకరు కాపు, ఒకరు వైశ్య, ఒకరు ఎస్టీ, ఒకరు మైనార్టీ, ఇద్దరు ఎస్సీ, ముగ్గురు రెడ్డి, ఏడుగురు బీసీ సామాజికవర్గాలకు చెందిన వారికి మంత్రులుగా అవకాశం దక్కింది .