CBN On DBT Schemes: ఏపీ ఆర్థిక పరిస్థితి తేరుకున్నాక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు-chandrababu naidu says he will give dbt schemes after the economic situation in ap improves ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Dbt Schemes: ఏపీ ఆర్థిక పరిస్థితి తేరుకున్నాక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు

CBN On DBT Schemes: ఏపీ ఆర్థిక పరిస్థితి తేరుకున్నాక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 28, 2025 03:30 AM IST

CBN On DBT Schemes: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత అయా పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన
ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన

CBN On DBT Schemes: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని ప్రజలు పరిస్థితి అర్ధం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మాట తప్పడం ఇష్టం లేదని, ప్రజలకు నిజం చెబుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి కొంచెం తెరుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్నీ తెలియచేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించే లేమన్నారు చంద్రబాబు..

ఏపీ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపై చంద్రబాబు సచివాలయంలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తొలిసారిగా నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని, నాయకుల అసమర్ధత కారణంగా ప్రజలకు, రాష్త్రం ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేక పోతే ప్రజల పై పన్నుల లాంటి భారం పడుతుందని, అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక ను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

ఏపీలో వృద్ధి రేటు లేక పోవడం వల్ల రూ 7 లక్షల కోట్ల మేర రాష్ట్రం నష్ట పోయిందని, ఏటా రూ. 76 వేల కోట్ల ఆదాయం పోయిందన్నారు. అందుకే రాష్ట్రానికి వృద్ధి రేటు అనేది చాలా ముఖ్యమని పదేపదే మా ప్రభుత్వం ప్రస్థావిస్తుందని చెప్పారు. తలసరి ఆదాయంలో కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజల కొనుగోలు స్థితి కూడా తగ్గిందని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సామాజిక విద్వంసం పై 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామని గుర్తు చేశారు.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల లో భాగంగా 15 శాతం వృద్ధిరేటు కోసం ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు. తద్వారా 2047 నాటికి తలసరి ఆదాయం రూ.58,14,916 కు చేరుతుందన్నారు.

సూపర్‌ సిక్స్ హామీల అమలు…

సూపర్ సిక్స్ లో ఎన్టీయార్ భరోసా లో భాగంగా 64 లక్షల మంది కి పెన్షన్ ఇస్తున్నామని చెెప్పారు. దీపం 2.0 పథకం లో ఏడాదికి 3 సిలెండర్ లు ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్ లు, మెగా డీఎస్సీ, ఇసుక, మద్యం, క్లీన్ ఎనర్జీ, ఏం ఎస్ ఏం ఈ లాంటి కొత్త విధానాలు తీసుకువచ్చామని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ.8,258 కోట్ల మేర బిల్లులు క్లియర్ చేశామని, రూ.9015 కోట్ల మేర కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి 76 పథకాలు రివైవ్ చేసినట్టు చెప్పారు. రూ. 1400 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వచ్చాయని, ఇప్పటి వరకూ రూ. 6,33,568 కోట్ల రూపాయలు మేర పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తద్వారా 4.10 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మేం ఊహించిన దానికంటే ఎక్కువగా ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, మేము చెప్పిందే ఇపుడు నీతి ఆయోగ్ ధృవీకరించిందన్నారు.

నీతి ఆ నివేదిక ప్రకారం ఏపి లో డెబిట్‌ సస్టైనబిలిటి లో సున్నా స్థాయిలో ఉందని, అప్పుల కోసం విశాఖ లో ఎమ్మార్వో కార్యాలయం కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. నీతి ఆయోగ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం రూపుందించిన నివేదిక లో ఏపి అట్టడుగు స్థానంలో ఉందని, 2022-23లో రాష్ట్రంలో ఆర్థిక వనరులు దారుణం గా దెబ్బతిన్నాయన్నారు. అసలు మూల ధన వ్యయం చేయలేదని, ఆరోగ్యం, విద్య తదితర సామాజిక అంశాల లో ఎక్కడా మూల ధన వ్యయం చేయలేదన్నారు. ఆర్థికాభివృద్ధిలోనూ ఆర్థిక వనరులు నాశనం చేశారన్నారు. తెచ్చిన అప్పులు అన్నీ ఏం చేశారో తెలియని పరిస్థితి ఉందన్నారు.

2022-23 లో రూ.67 వేల కోట్లు అప్పులు తెచ్చారని, కానీ ఆ రుణం లో కనీస స్థాయి లోకూడా అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదని, వచ్చిన డబ్బులతో వైసిపి ప్రభుత్వం దుబారా మాత్రమే చేసిందన్నారు. రాష్ట్ర ఆదాయం కూడా 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిపోయిందని, అప్పులు 16.5 శాతం మేర పెరిగాయని, వడ్డీలు కట్టే మొత్తం కూడా 15 శాతం మేర పెరిగిందని చెప్పారు.

ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూల ధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల కారణం గా ఏపి అప్పుల ఊబి లో కూరుకు పోయిందన్నారు. 2022-23 లో కేవలం రూ.7,244 కొట్లు మాత్రమే మూల ధన వ్యయం చేశారని, జీఎస్‌డీపీలో ఇది కేవలం 0.5 శాతం మాత్రమే ఉందన్నారు. ఒక్క జలవనరుల ప్రాజెక్టు ను కూడా పూర్తి చేయలేదని, 2014-19 తో పోలిస్తే గత ఐదేళ్ల లోమూల ధన వ్యయం 60 శాతం మేర తగ్గిపోయిందన్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ లో ఏపి 18 ర్యాంకు లో ఉందని

ప్రజలు అర్థం చేసుకోవాలి…

ఏపీలో వార్షిక బడ్జెట్‌ అటుఇటుగా రూ.2లక్షల కోట్లు ఉంటే ఉద్యోగుల జీతాలకు ఏటా రూ.70వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. డీబీటీ పథకాలకు కూడా భారీగా వెచ్చించడం వల్ల అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో పోలవరం, అమరావతి నిర్మాణం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది.

ఈ ఏడాది చివరికి డీబీటీ పథకాలు…

ఏపీలో ఈ ఏడాది చివరకు తల్లికి వందనం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రాధాన్యత క్రమంలో సూపర్‌ సిక్స్‌ హామీలు, డీబీటీ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Whats_app_banner