Chandrababu On Jagan : ఆ విషయంలో పూర్తి బాధ్యత నాదే.. అభివృద్ధి రివర్స్ గేరులో వెళ్తోంది
Chandrababu Kurnool Tour : తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక.. ఉద్యోగాల విప్లవం వస్తుందన్నారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువత భవితను జగన్ అంధకారం చేశారని ఆరోపించారు. సీఎం జగన్ ను ఇంటికి పంపిస్తే.. రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. కోడుమూరులోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. కర్నూలు(Kurnool) జిల్లా పారిశ్రామిక హబ్ అయ్యేదన్నారు.
పర్యటనలో భాగంగా..విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చించారు. జాబు రావాలి అంటే.. బాబు రావాలి అని నినాదాలు చేశారు. జగన్(Jagan) పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళ్తుందని.. విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
'రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ విషయంలో నాకంటే చెప్పేవాడు, చేసేవాడు ఎవరూ లేరు. టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు(Jobs) వచ్చాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసం హైదరాబాద్(Hyderabad) ఎందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టారు. కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చాం.' అని చంద్రబాబు అన్నారు.
కర్నూలు జిల్లాకు సీడ్ పార్క్(Seed Park) తెచ్చామని చంద్రబాబు అన్నారు. సోలార్ పార్క్(Solar Park) తెస్తే కమీషన్‌ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారన్నారు. అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించనన్నారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యక్రమం టీడీపీ(TDP) హయాంలోనే జరిగిందని వ్యాఖ్యనించారు. హైదరాబాద్ ఐటీ రంగం ఇంతగా అభివృద్ధి అవడానికి కారణం ఆ రోజుల్లో చేసిన అభివృద్ధేనని చంద్రబాబు గుర్తు చేశారు.
'చాలా మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో అవినీతి పెరిగింది. అభివృద్ధి(Development) మాత్రం శూన్యం. సీఎం జగన్(CM Jagan) అమరావతిని నాశనం చేశారు. విశాఖ(Visakha)లో ప్రభుత్వ భూములను జగన్, ఏ2 విజయసాయి రెడ్డి కొట్టేస్తున్నారు. బెదిరించి, గొంతు మీద కత్తి పెట్టి భూములు రాయించుకున్నారు. వైసీపీ నేతల తీరుతో రాయలసీమ(Rayalaseema)లో మళ్లీ ఫ్యాక్షన్ పెరుగుతోంది.' అని చంద్రబాబు అన్నారు.
గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని. అయినా గాలికి వదిలేశారని చంద్రబాబు(Chandrababu) మండిపడ్డారు. రోడ్లు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు(3 Capitals) ఎలా కడతారని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి వంతపాడడం మానుకోవాలన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం అని చంద్రబాబు స్పష్టం చేశారు. నీరు, ఉండే ప్రాంతాలు, ఎయిర్ పోర్ట్(Air Port), సహా అన్ని నంద్యాల జిల్లాకు వెళ్లాయన్నారు. 'దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు(Farmers Suicide) ఉండేది మన రాష్ట్రంలోనే. ఈ శనికి కారణం జగన్ మోహన్ రెడ్డి. పోలీసుల పొట్ట కూడా కొట్టిన ముఖ్యమంత్రి జగన్. తప్పు చేసిన అధికారులను వదలిపెట్టం. జగన్ ను నమ్మితే జైలుకే పోతారు.' అని చంద్రబాబు అన్నారు.