మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆగస్టు 15 నుంచి అమలు.. చంద్రబాబు కీలక ప్రకటన-chandrababu naidu announces free bus travel for women from august 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆగస్టు 15 నుంచి అమలు.. చంద్రబాబు కీలక ప్రకటన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆగస్టు 15 నుంచి అమలు.. చంద్రబాబు కీలక ప్రకటన

కూటమిని అధికారంలోకి తెచ్చిన కీలక హామీల అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని బాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం చంద్రబాబు

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఈ మేరకు ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తుందని చెప్పారు. రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామన్న చంద్రబాబు.. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తామని ప్రకటించారు. రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్‌ తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ప్రజలతో ప్రమాణం..

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు సీఎం వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని ಅన్ని నియోజకవర్గాల్లో రైతుబజార్లు ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత కథనం