Chandrababu Key Partner in NDA : ఏపీలోలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకుంది. ఇదే సమయంలో కేంద్రంలోనూ కీలకంగా మారిపోయింది. ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. 16 ఎంపీ స్థానాలతో బలమైన శక్తిగా మారింది. దీంతో కేంద్రంలో మళ్లీ చంద్రబాబు పావులు కదిపే సువర్ణ అవకాశం లభించిందన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం….పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెద్దగా పరిష్కరం కాలేదు. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో….. చంద్రబాబు కేంద్రంలో అత్యంత కీలంగా మారారు.
బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోగా… భాగస్వామ్యపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో నితీశ్ కుమార్, చంద్రబాబు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు…. ఏపీకి సంబంధించి పలు ముఖ్య అంశాలపై దృష్టిసారించి….త్వరితగతిన కేంద్రం నుంచి పరిష్కారం రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందులో కొన్ని అంశాలను చూస్తే…….
ఇవేకాకుండా…. అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రతి అంశంపై కూడా ఏపీలోని చంద్రబాబు సర్కార్ ప్రధానంగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై స్పందిస్తున్న పలువురు విశ్లేషకులు…. చంద్రబాబు టైమ్ వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. వైసీపీకేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలను చూస్తే… తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది.
జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. బీజేపీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందింది. పార్లమెంట్ స్థానాల్లో చూస్తే… టీడీపీ 16 ఎంపీ స్థానాలు, వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది.