Chandrababu: పెద్ద నోట్ల రద్దు శుభసూచికం.. కేంద్రానికి అప్పుడే చెప్పానన్న చంద్రబాబు-chandrababu fires on cm ys jagan over idem karma mana rashtraniki at anakapalli ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chandrababu Fires On Cm Ys Jagan Over Idem Karma Mana Rashtraniki At Anakapalli

Chandrababu: పెద్ద నోట్ల రద్దు శుభసూచికం.. కేంద్రానికి అప్పుడే చెప్పానన్న చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
May 20, 2023 08:55 AM IST

Chandrababu Fires On CM Jagan: ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు(ఫైల్ ఫొటో)
చంద్రబాబు(ఫైల్ ఫొటో)

Idem Karma Mana Rashtraniki at Anakapalli:సీఎం జగన్ పాలనపై ప్రజలు బాగా ఆగ్రహంతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం అనకాపల్లిలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం లో పాల్గొన్న ఆయన వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు సంవత్సరాల్లో వైసీపీ సర్కార్ ప్రజల కోసం ఏమైనా చేసిందా? అని నిలదీశారు. ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో జీవితాలన్నీ ఆవిరైపోతున్నాయని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

"సీఎం జగన్ ధనపిశాచి.ఎంత వచ్చినా అతనికి చాలడం లేదు. అనేక రకాల పిచ్చి వాళ్ళు ఉంటే జగన్ మాత్రం డబ్బుల పిచ్చోడు. రాష్ట్రంలోని సంపద అంతా అతనికే కావాలి. డబ్బుల కోసం మిమ్మల్ని చంపుతాడు, ఎవరినైనా చంపేస్తాడు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరెంటు కోతలు కూడా ఉన్నాయి. 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది న్యాయమా? తమ్ముళ్లు.. మీరే చెప్పాలి. రోడ్ షోలను నిరోధించాలని జగన్ ప్రయత్నించి భంగపడ్డారు. నేను నిర్వహించే రోడ్ షోలకు జనం విపరీతంగా వస్తున్నారు. రోడ్ షోలు పెట్టుకొనే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రజల బాధల్ని తెలియజేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. వెనుకబడిన జిల్లాలు ఉండే ప్రాంతం, పేదవారు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. వెనుకబడిన వర్గాలు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. నీతి నిజాయితీకి మారుపేరు ఉత్తరాంధ్ర జిల్లాలు. మంచికి మారుపేరు విశాఖపట్నం. అలాంటి ఈ ప్రాంతంలో వైసీపీ వచ్చి నాశనం చేసింది. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయి. మీ ఆస్తులు కబ్జా చేస్తున్నారు. వైసీపీ గద్దలు విశాఖపట్నం మీద వాలాయి. ఈ నాలుగు ఏళ్ళల్లో 40 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేశారు.మధురవాడలో 5 ఎకరాల 50 సెంట్లు అంటే 700 కోట్ల రూపాయలు భూములు వైసీపీ నాయకులు దోచేశారు. రేడియంట్ పేరు పెట్టి 1000 కోట్ల ఆస్తి కబ్జా చేశారు" అని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ నాయకులకు భయపడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు. నేను పెద్ద పెద్ద బాంబులకే భయపడలేదు. వీళ్ళకి ఎందుకు భయపడతానా ? అంటూ ఘాటుగా మాట్లాడారు." తండ్రి హత్యపై కుమార్తె ప్రాణాలు కూడా లేక్క చేయకుండా పోరాడుతోంది. బాబాయ్ కిల్లర్ అవినాష్ రెడ్డి డ్రామాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆయన డ్రామాల గురించి ఒక సినిమా తీయొచ్చు.అవినాష్ రెడ్డిని సిబిఐ కూడా పట్టుకోలేకపోతోంది. జగన్ కి నేరాలు చేసే అలవాటుంది.. నేరాలు చేసి డబ్బులు బాగా సంపాదించాడు. బాబాయిని హత్య కేసు వ్యక్తిని కాపాడటానికి జగన్ అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు. వివేకా హంతకునికి శిక్ష పడాలి. జగన్ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

ఈ ముఖ్యమంత్రి ఫ్రాంక్లిన్ టెంపుల్ , ఫార్చ్యూన్ కంపెనీలను పంపించేశాడు. భావనపాడు పోర్టును కూడా రాకుండా చేశారు. భావనపాడు పోర్టు వస్తే దాన్ని క్యాన్సిల్ చేశాడు. భోగాపురం పోర్టు నేను ఉండి ఉంటే పనులు పూర్తయ్యేవి. జగన్ రాక ఉత్తరాంధ్రకి ఒక శనిగ్రహం. నేను అమరావతిని రాజధానిగా చేసి విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా టూరిజం హబ్ గా చేద్దామనుకున్నాను. జగన్ శనిలా వచ్చి మూడు ముక్కలాట ఆడుతున్నాడు. విశాఖపట్నం పైన జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదు. జగన్ కి మీ ఆస్తుల మీద ప్రేమ ఎక్కువ" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

శుభసూచికం..

పెద్ద నోట్ల రద్దుపై చంద్రబాబు స్పందించారు. డిజిటల్ కరెన్సీ పై నాడు కేంద్రానికి రిపోర్టును ఇచ్చానని గుర్తు చేశారు. ఈ దేశంలో అవినీతిపరులు ఉన్నారని... ప్రజల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. "2000 రూపాయల నోట్లు రద్దు చేయమని నేను కేంద్రానికి గతంలో సూచించాను. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని సూచించా. మనీ లాండరింగ్ జరుగుతోందని చెప్పా. పెద్ద నోటు రద్దు శుభ సూచకం. నేను ఎల్లప్పుడు ప్రజల తరపున పోరాడతాను" అంటూ ప్రసంగించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం