Chandra Babu : ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం…. చంద్రబాబు-chandra babu naidu fires on state sponsored terrorism in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chandra Babu Naidu Fires On State Sponsored Terrorism In Andhra Pradesh

Chandra Babu : ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం…. చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 07:06 AM IST

Chandra Babu ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో రాయలసీమ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల కుటుంబాలకు ఉపాధి చూపిన అమర్‌ రాజా సంస్థ తరలిపోడానికి ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదమే కారణమని చంద్రబాబు ఆరోపించారు.

అమర్ రాజా బ్యాటరీ కంపెనీ తరలిపోవడంపై చంద్రబాబు  ఆగ్రహం
అమర్ రాజా బ్యాటరీ కంపెనీ తరలిపోవడంపై చంద్రబాబు ఆగ్రహం (twitter)

Chandra Babu ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని, అందుకే అమరరాజా వెళ్ళిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 4 దశాబ్దాల ప్రస్థానంలో, రాయలసీమ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన సంస్థ అమరరాజా సంస్థ అని చంద్రబాబు చెప్పారు. బిలియన్ డాలర్ కంపెనీ ఇప్పుడు సొంత రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి కారణం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదం నడుస్తోందని, రాష్ట్రానికికే గర్వ కార్వకారణంగా నిలిచిన సంస్థకు ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

ఏపీలో పుట్టిన సంస్థ తొలిసారి చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల రూ.9500 కోట్ల పెట్టుబడి పెడుతోందని, ప్రతిష్టాత్మక సంస్థను ప్రోత్సహించాల్సింది పోయి, గతంలో ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, తనిఖీల పేరుతో నిత్యం ఇబ్బంది పెట్టారని ఫలితంగా రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు.

ఉపాధి నిచ్చే పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మీ శాడిజం చాటుకున్నారని, కోర్టు తప్పుపట్టినా వైఖరి మార్చుకోలేదని,రాజకీయ కక్షలతో ప్రజల ప్రయోజనాలనే కాదు...రాష్ట్ర ప్రతిష్టనే పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలు, చరిత్ర క్షమించవు అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన కర్మాగారం, పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వంతో అమర్‌ రాజా ఒప్పందం చేసుకున్న కథనాన్ని చంద్రబాబు ట్వీట్‌కు జత చేశారు.

చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమర్‌ రాజా బ్యాటరీల సంస్థ తెలంగాణ తరలిపోవడంపై గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అమర్‌ రాజా సంస్థను మూడేళ్లుగా ప్రభుత్వం టార్గెట్ చేయడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆరోపిస్తున్నారు. అమర్ రాజా సంస్థపై ప్రభుత్వ వేధింపులు భరించలేక తాజా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు ఆ సంస్థ ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఈ పరిణామాలు ఏపీలో రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

IPL_Entry_Point

టాపిక్