ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 7 గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో 100. 5మిమీ, చొల్లంగిపేటలో 94.5మిమీ, కరపలో 75.5మిమీ, కాకినాడలో 66.7మిమీ, కోనసీమ జిల్లా అమలాపురంలో 65.5మిమీ, ఏలూరు నిడమర్రులో 65.2మిమీ, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 65మిమీ,ఏలూరు ధర్మాజీగూడెంలో 64.5మిమీ వర్షపాతం చొప్పున భారీ వర్షాలు నమోదైంది
పలు జిల్లాల్లో 130చోట్ల 20మిమీ కంటే ఎక్కువ పిడుగులతో కూడిన మోస్తారు వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడి పోయే పరిస్థితుల నుంచి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం దంచి కొడుతోంది.
ఏపీలో మరో రెండు రోజుల వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలతో తడిచి ముద్దయ్యాయి.
సోమ, మంగళ వారాల్లో (మే 5, 6తేదీల్లో) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా,నెల్లూరు,కర్నూలు, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని అధికారులు హెచ్చరించారు.
రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41°C - 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది.
ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో 42.7°C, నెల్లూరు జిల్లా సోమశిలలో 42.5°C, తిరుపతి జిల్లా
వెంకటగిరిలో 42.1°C, వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 41.8°C, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 41.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది.
సంబంధిత కథనం