CEO Andhrapradesh : అలాంటి వారిపై కేసులు పెట్టాలి - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు-ceo mukesh kumar meena key orders on duplicate voter and double vote in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ceo Andhrapradesh : అలాంటి వారిపై కేసులు పెట్టాలి - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

CEO Andhrapradesh : అలాంటి వారిపై కేసులు పెట్టాలి - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 08, 2023 06:00 PM IST

AP CEO Mukesh Kumar Meena: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటు పై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక వ్యక్తి కి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు.

డూప్లికేట్ ఓటు,  డబుల్ ఓటు పై ఈ సీ కీలక ఆదేశాలు
డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటు పై ఈ సీ కీలక ఆదేశాలు

AP Chief Electoral Officer Mukesh Kumar Meena: డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటు పై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కీలక ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లో ఓటు ఉన్నవారికి చెక్ పెట్టే దిశగా కీలక ప్రకటన చేశారు.ఒక వ్యక్తి కి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

yearly horoscope entry point

వేరే రాష్ట్రాల్లో ఓటు ఉన్నవారికి ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. వీటిపై దృష్టిపెట్టిన ఏపీ ఎన్నికల సంఘం… ఒక వ్యక్తి కి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి కి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలు కు విరుద్దమని తెలిపింది. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలని… కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలని… తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. తప్పుడు డిక్లరేషన్ తో ఓటు నమోదు ధరఖాస్తు చేస్తే జైలు శిక్ష ఉంటుందని… 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా ధరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్కులు ఇవ్వాలని సూచించారు.

ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు ముఖేష్ కుమార్ మీనా. ఇళ్లు మారే వాళ్లు ఓటు కి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలని,,, తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Whats_app_banner