ఆంధ్రా పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు: కేంద్రం-centre plans interest free loans for andhra cyclone hit tobacco farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Centre Plans Interest Free Loans For Andhra Cyclone Hit Tobacco Farmers

ఆంధ్రా పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు: కేంద్రం

HT Telugu Desk HT Telugu
Jan 04, 2024 03:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ పొగాకు రైతులకు రూ. 10,000 నుంచి రూ. 20,000 మధ్య వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. వీటి కాలపరిమితి ఆరు నెలలు ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్రం యోచన
ఆంధ్ర ప్రదేశ్ పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్రం యోచన (REUTERS/Rajendra Jadhav (INDIA))

మిచాంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌లోని 15 వేల మంది పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు అందించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. రూ.10,000 నుంచి రూ. 20,000 వరకు ఇచ్చే వడ్డీలేని రుణాల కాలపరిమితి ఆరు నెలల పాటు ఉంటుందని, పొగాకును తిరిగి నాటడానికి సహకరిస్తుందని అధికారులు తెలిపారు. పొగాకు బోర్డు పంపిన ప్రతిపాదనను వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, త్వరలోనే ఇది ఖరారు అవుతుందని వారు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్‌ను తాకిన మిచాంగ్, భారతదేశ పొగాకు ఉత్పత్తిలో ఐదవ వంతు వాటా ఉన్న రాష్ట్రంలో రైతులకు భారీ నష్టాన్ని కలిగించింది. చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుగా భారత్ ఉంది. ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 9% వాటాను కలిగి ఉంది.

తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు సాగు దెబ్బతింది. రాష్ట్రంలోని పేద, అణగారిన రైతులకు మధ్యంతర ఉపశమనం కల్పించాలని రైతులు, పార్లమెంటు సభ్యుల నుంచి విజ్ఞప్తులు అందాయి.

భారతదేశం ఏటా 800 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ఉత్పత్తిలో 45% తో గుజరాత్ అత్యధిక వాటా కలిగి ఉంది. తరువాత ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.

మొక్కలు నాటే సీజన్ నవంబర్ నెలాఖరులో ప్రారంభమై జనవరి మధ్య వరకు కొనసాగుతుంది. మార్చి నెలాఖరులో పంటల కోత ప్రారంభమై జూన్ వరకు కొనసాగుతుందని రెండో అధికారి తెలిపారు.

మరోవైపు పొగాకు ఎగుమతులు కూడా బాగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ధరలలో కూడా దిద్దుబాట్లు ఉన్నాయి. ఇవి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేలంలో ధర గత ఏడాది కంటే 10 శాతం అధికంగా ఉండటం శుభసూచకమని అధికారులు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (2023 ఏప్రిల్-నవంబర్) భారత్ 981.05 మిలియన్ డాలర్ల విలువైన పొగాకును ఎగుమతి చేసింది. బెల్జియం, యూఏఈ, ఇండోనేషియా, రష్యా, కొరియా, అమెరికా, యెమెన్, ఈజిప్ట్, సింగపూర్, నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, టర్కీ, నేపాల్ ఎగుమతి గమ్యస్థానాలు.

పొగాకు పరిశ్రమలో 60 లక్షల మంది రైతులు, 20 మిలియన్ల మంది వ్యవసాయ కూలీలతో సహా సుమారు 36 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. 10 మిలియన్ల మంది ప్రాసెసింగ్, తయారీ, ఎగుమతుల్లో నిమగ్నమయ్యారని వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) నివేదిక తెలిపింది.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లోని పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటలకు మారేలా ప్రోత్సహిస్తూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాన్ని (సీడీపీ) ప్రోత్సహిస్తోంది.

IPL_Entry_Point