Padma Awards : దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డుల పొందిన తెలుగు వాళ్లు వీరే-central govt announced padma awards hero balakrishna manda krishna madiga nageshwar reddy got awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Padma Awards : దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డుల పొందిన తెలుగు వాళ్లు వీరే

Padma Awards : దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డుల పొందిన తెలుగు వాళ్లు వీరే

Padma Awards : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ, దువ్వూరు నాగేశ్వరర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురష్కారాలు వరించాయి.

దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, హీరో బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డుల పొందిన తెలుగు

Padma Awards : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 139 మందిని పద్మ అవార్డులు వరించాయి. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులు దక్కాయి.

పద్మ శ్రీ అవార్డులు

  • మందకృష్ణ మాదిగ(ప్రజా వ్యవహారాలు)-తెలంగాణ
  • కేఎల్ కృష్ణ(సాహిత్యం)-ఏపీ
  • మాడుగుల నాగఫణి శర్మ(కళలు)-ఏపీ
  • మిర్యాల అప్పారావు(కళలు)-ఏపీ
  • వద్దిరాజు రాఘవేంద్రాచార్య(సాహిత్యం)-ఏపీ

పద్మ భూషణ్

  • నందమూరి బాలకృష్ణ(కళలు)- ఏపీ

పద్మ విభూషణ్

  • దువ్వూరు నాగేశ్వరర్ రెడ్డి(వైద్యం) - తెలంగాణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఏపీ నుంచి కళల విభాగంలో బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

"పద్మభూషణ్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, సినిమా, రాజకీయాలు, దాతృత్వ రంగాలలో రాణించారు. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీరు చేసిన సేవ లెక్కలేనన్ని జీవితాలను తాకింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. నిజమైన ఐకాన్, నాయకుడికి ఇది తగిన గౌరవం" అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు దక్కడంతో అభినందనలు తెలిపారు. వైద్య రంగానికి నాగేశ్వర్ రెడ్డి చేసిన అద్భుతమైన కృషి దేశానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి ఎంతో గర్వకారణం అన్నారు.

బాలకృష్ణకు మంత్రి లోకేశ్ అభినందనలు

"బాలయ్య అన్‌స్టాపబుల్‌. పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న మీ అందరి బాలయ్య నా ముద్దుల మావయ్య బాలకృష్ణకు అభినందనలు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది బాలయ్యకే సాధ్యం. 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోస్, పాలిటిక్స్ ఎందులోనైనా నంబర్ 1 మన బాలయ్య. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మన బాలయ్యకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 1974లో తాతమ్మ కలతో మొదలైన సినీ ప్రయాణం డాకు మహారాజ్ వరకూ కొనసాగుతూనే ఉంది.

అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్యకు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికి 109 సినిమాల్లో హీరోగా చేశారు. అందులో 100 రోజులు కాదు 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఎవరైనా ఒక జానర్ లో సక్సెస్ అవుతారు. కానీ అన్ని జానర్స్ లో సినిమాలు తీసి తనదైన ముద్ర వేసిన కథానాయకుడు బాలయ్య. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సోషియో ఫాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా బాలయ్యకే సాధ్యం.

గౌతమీ పుత్రశాతకర్ణిగా మీసం మెలేసినా బాలయ్యే.... అఖండగా గర్జించినా బాలయ్యే. ఆయన నిర్మాతల హీరో, దర్శకుల హీరో, అభిమానుల హీరో. తన సినిమానే కాదు... సినిమా పరిశ్రమ కూడా బాగుండాలి అని భావించే నిజమైన హీరో. పద్మ భూషణ్ అవార్డుతో బాలయ్య మరో మెట్టు ఎక్కారు.కంగ్రాట్స్"- మంత్రి లోకేశ్

" ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు వరించిన బాల బాబాయ్ కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనం"-జూ.ఎన్టీఆర్

ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాబాయి నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఈ గౌరవం మీరు సినిమా ప్రపంచానికి చేసిన అసాధారణ కృషికి, సమాజ సేవలో మీ అవిశ్రాంత కృషికి నిజమైన గుర్తింపు"- నందమూరి కల్యాణ్ రామ్