YS Viveka Murder Case :వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మళ్లీ నోటీసులు-cbi notices to ys bhaskar reddy for enquiry in ex minister ys vivekananda reddy murders case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Notices To Ys Bhaskar Reddy For Enquiry In Ex Minister Ys Vivekananda Reddy Murders Case

YS Viveka Murder Case :వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి మళ్లీ నోటీసులు

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 07:35 AM IST

YS Viveka Murder Case మాజీ మంత్రి వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులిచ్చింది. ఇప్పటికే ఓ మారు సిబిఐ నోటీసులిచ్చినా వ్యక్తిగత పనులతో భాస్కర్‌ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో మార్చి 12న కడప సెంట్రల్ జైల్‌లో విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రికి సిబిఐ నోటీసులు
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రికి సిబిఐ నోటీసులు

YS Viveka Murder Case మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ బుధవారం మరోమారు నోటీసులు ఇచ్చింది. పులివెందులలోని భాస్కర్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందచేశారు. మార్చి 12వ తేదీన ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు గెస్ట్‌ హౌస్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

వివేకా హత్య కేసులో సీబీఐవిచారణను ముమ్మరం చేసింది. వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో రెండుసార్లు విచారించింది. తాజాగా అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారించడానికి నోటీసులిచ్చింది.

వివేకా హత్య జరిగిన రోజు ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడంతో పాటు కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు భాస్కర్‌రెడ్డిని విచారణకు పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు నిందితుడు సునీల్‌యాదవ్‌.. భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిర్ధారణ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో సీబీఐ విచారణపై ఉత్కంఠ నెలకొంది. పిభ్రవరి 23న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆ సమయంలో తనకు ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నందున రాలేనని భాస్కర్‌ రెడ్డి సమాధానమిచ్చారు. దీనిపై గడువు ఇచ్చిన సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ విచారించడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భాస్కరరెడ్డికి రెండోసారి నోటీసులు ఇవ్వడంపై ఈ కేసులో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డిని సీబీఐ సూత్రధారిగా భావిస్తోంది.

వైఎస్ వివేకా హత్య కేసులో సూత్రధారుల గుట్టు రట్టు చేసేందుకు సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డిని రెండుసార్లు హైదరాబాద్‌కు పిలిపించి విచారించింది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని గత నెల 23న విచారణకు రావాలని నోటీసు జారీ చేసినా, ఆ రోజు కుటుంబ పనులు ఉన్న కారణంగా మరో రోజు వస్తానని భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో గత నెల 26న సెంట్రల్‌ జైలు అతిథిగృహంలో ఆయన విచారణకు హాజరవుతారని ప్రచారం జరిగింది.

గత నెల 26 సీబీఐ బృందం సైతం కడపకు చేరుకున్న నేపథ్యంలో విచారణకు రమ్మంటే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు మెసేజ్‌ పెట్టడంతో పాటు ఫోను కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సిబిఐ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో విచారణ ఆగిపోయింది. తాజాగా మార్చి 12న విచారణకు రావాలని సిబిఐ ఆదేశించింది.

IPL_Entry_Point