YS avinashReddy: కర్నూలు చేరుకున్న సిబిఐ బృందాలు..అవినాష్ అరెస్ట్‌పై ఉత్కంఠ!-cbi investigation teams have reached kurnool and are spreading the word that they will arrest avinash redd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cbi Investigation Teams Have Reached Kurnool And Are Spreading The Word That They Will Arrest Avinash Redd

YS avinashReddy: కర్నూలు చేరుకున్న సిబిఐ బృందాలు..అవినాష్ అరెస్ట్‌పై ఉత్కంఠ!

HT Telugu Desk HT Telugu
May 22, 2023 09:25 AM IST

YS avinashReddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. తల్లకి అనారోగ్యం కారణంగా కర్నూలు ఉన్న అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోడానికి సిబిఐ సిద్ధం అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఎంపీ అవినాష్ రెడ్డి
ఎంపీ అవినాష్ రెడ్డి

YS avinashReddy: కర్నూలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు సిబిఐ విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ బృందాలు కర్నూలు చేరుకున్నాయి. దీంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని ప్రచారం మొదలైంది. అవినాష్‌ అరెస్ట్‌పై కర్నూల్ ఎస్పీకి సీబీఐ లిఖిత పూర్వకంగా సమాచారం అందించినట్లు కర్నూలు నుంచి కథనాలు వెలువడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేస్తారనే వార్తల నేపథ్యంలో కర్నూల్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా చేరుకున్నారు.

గత వారం సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు కావడంతో మూడు రోజుల క్రితం మే 22న విచారణకు రావాలని సిబిఐ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన తల్లి శ్రీలక్ష్మి కి ఆరోగ్యం బాగోలేదని పది రోజులు గడువు కావాలని అవినాష్ రెడ్డి సిబిఐను కోరారు. అవినాష్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిబిఐ కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

మరోవైపు విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ రెడ్డి మకాం వేయడంతో కర్నూల్ ఎస్పీ ని సిబిఐ అధికారులు కలిశారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే అవినాష్ రెడ్డి ఉండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఆస్పత్రి సమీపంలో దుకాణాలను తెరవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

కర్నూలులో పరిస్థితిపై సిబిఐ ఉన్నతాధికారుల ఆరా తీస్తు్నారు. ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో సీబీఐ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్ కు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు , జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా అవినాష్ రెడ్డి వ్యవహారంపై సమాచారాన్ని అందచేసినట్లు తెలుస్తోంది. వరుసగా మూడుసార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ జిల్లా పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.

మరోవైపు విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణులు బైఠాయించడంతో ఆస్పత్రి ఆవరణలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, శ్రీ లక్ష్మీ కార్డియో సమస్యతో బాధపడుతున్నారని, అవినాష్ రెడ్డి తల్లి వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని, అవినాష్ రెడ్డి తల్లికి వాంతులు అయినందున అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలని వెల్లడించారు. అవినాష్ రెడ్డి తల్లికి బీపీ తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసీయూలో చికిత్స అందించాలని వైద్యులు పేర్కొన్నారు.

IPL_Entry_Point