ఉమ్మడి అనంతపురం జిల్లా ఓబులాపురం గనుల కేసులో వాదనలు ముగిశాయి. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసులో దాదాపు 16 ఏళ్లకుపైగా విచారమ కొనసాగుతోంది. ఎట్టకేలకు వాదనలు ముగియటంతో…. మే 6వ తేదీన సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.
ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు ఐఎస్ఎస్ అధికారులు ఉన్నారు. తెలంగాణకు చెందిన అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితోపాటు వీడీ రాజగోపాల్, జనార్ధన్‌రెడ్డి పీఏ అలీఖాన్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 200 మందికిపైగా సాక్ష్యులను విచారించగా… 3వేలకుపైగా డాక్యుమెంట్లను కోర్టు పరిశీలించింది. ఇరువైపు వాదనలు తర్వాత… మే 6న తుది తీర్పు రానుంది. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఉత్కంఠ నెలకొంది.
గాలి జనార్ధన్‌రెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా తవ్వకాలు జరిపి ఎగుమతి చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసుకు సంంబంధించి 2009 డిసెంబర్ 7న హైదరాబాద్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పట్నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా విచారణను ఎదుర్కొన్నారు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్వకాలు సాగిస్తోందంటూ 2004-2009 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. OMCలో అక్రమాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. అప్పట్లో ఓబుళాపురం గనుల తవ్వకాలపై అసెంబ్లీ సభా సంఘాన్ని కూడా నియమించింది.
టాపిక్