AP EAMCET Engineering Answer Key 2024: ఏపీ ఈఏపీసెట్ 2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదలైంది. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి ప్రిలిమినరీ కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 26వ తేదీలోపు పంపాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని కూడా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు…. మే 18 నుండి 23 వరకు 9 సెషన్స్ లో నిర్వహించారు. రోజుకు రెండు సెషన్స్ లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించారు.
ఏపీ ఈఏపీ సెట్‌ను కాకినాడ జేఎన్‌టియూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 93.47శాతం మంది విద్యార్ధులు బైపీసీ, ఎంపీసీతో పాటు రెండు స్ట్రీమ్‌లకు జరిగిన పరీక్షలకు హాజరైనట్టు కన్వీనర్ వెల్లడించారు. ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్‌ను నిర్వహించారు.
ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి అన్ని సెషన్లలో కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,58,373 మంది పరీక్షకు హాజరయ్యారు. 15840మంది గైర్హాజరు అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.22 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లకు 88,638 మంది ఈఏపీ సెట్‌కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 7872మంది గైర్హాజరయ్యారు. ఈ విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఈఏపీ సెట్ 2024కు మొత్తంగా 3,62,851 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 23712మంది గైర్హాజరు కావడంతో 93.47 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం