Trains Cancelled: హౌరా మార్గంలో మూడ్రోజుల పాటు పలు రైళ్ల రద్దు-cancellation of many trains on howrah route for three days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Cancellation Of Many Trains On Howrah Route For Three Days

Trains Cancelled: హౌరా మార్గంలో మూడ్రోజుల పాటు పలు రైళ్ల రద్దు

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 06:28 AM IST

Trains Cancelled: ఒడిశాలోని బాలసోర్ జిల్లా బహన్‌గా బజార్‌ స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంతో గత ఐదు రోజులుగా పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటి గమ్యస్థానాలను మార్చారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్దరించినా సాంకేతిక కారణాలతో పలు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో 9వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

రైలు నంబరు 22831 హౌరా-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైలును 7వ తేదీన రద్దు చేశారు. 12839 హావ్‌డా-చెన్నై సెంట్రల్‌ 7వ తేదీన, 22842 తాంబరం-సంత్రాగచ్చి 7వ తేదీన, 22503 కన్యాకుమారి-దిబ్రూగఢ్‌ , 12864 బెంగళూరు - హావ్‌డా రైలు బుధవారం రద్దు చేవారు.

ట్రైన్ నంబర్ 176503/18047 కాచిగూడ/షాలిమార్-వాస్కో డా గామా రైలు,ట్రైన్ నంబర్ 18045 షాలిమార్-హైదరాబాద్‌ రైలు, ట్రైన్ నంబర్ 22831 హౌరా - సత్యసాయి ప్రశాతం నిలయం, ట్రైన్ నంబర్ 12254 బగల్పూర్- ఎస్‌ఎంవిటి బెంగుళూరు, ట్రైన్ నంబర్ 12839 హౌరా-ఎంజిఆర్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌, ట్రైన్ నంబర్ 22842 తాంబరం-సంత్రగచ్చి, ట్రైన్ నంబర్ 22503 కన్యాకుమారి- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం రద్దు చేశారు

ట్రైన్ నంబర్ 22832 శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 18048వాస్కో డా గామా - షాలిమార్/కాచిగూడ రైలు 9వ తేదీన రద్దు చేశారు.ట్రైన్ నంబర్ 12864 బెంగులూరు-హౌరారైలుతో పాటు, 22888 బెంగుళూరు-హౌరా రైలును గురువారం 8వ తేదీన రద్దు చేశారు.

IPL_Entry_Point