AP Cabinet On CRDA: సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం, పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు-cabinet decision revising the boundaries of crda formation of pithapuram urban development authority ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet On Crda: సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం, పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

AP Cabinet On CRDA: సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం, పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 06, 2024 01:02 PM IST

AP Cabinet On CRDA: వైసీపీ హయంలో కుదించిన సిఆర్‌డిఏ పరిధిని తిరిగి యథాతథ స్థితికి మారుస్తూ ఏపీ క్యాబినెట్‌ అమోద ముద్ర వేసింది. పిఠాపురంలో కొత్త అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది.

సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ ఏపీ క్యాబినెట్‌ తీర్మనం
సిఆర్‌డిఏ పరిధిని పునరుద్ధరిస్తూ ఏపీ క్యాబినెట్‌ తీర్మనం

AP Cabinet On CRDA: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత పరిధిని పునరుద్ధరిస్తూ ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయంలో సిఆర్‌డిఏ పరిధిని కుదించి అమరావతి ప్రాంతానికి పరిమితం చేసింది. దీంతో రాజధాని ప్రాంత విస్తర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గతంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో పరిధిలో 8352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిఆర్‌డిఏను ఏర్పాటు చేశారు.

వైసీపీ హయంలో దానిని బాగా కుదించి రాజధాని గ్రామాలకు పరిమితం చేశారు. అమరావతి రాజధాని మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేలా సిఆర్‌డిఏను కుదించారు. 2328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి తగ్గించడంతో రాజధానికి గుర్తింపు లేకుండా పోయింది. తాజాగా అమరావతి రాజధానిని కొనసాగించేలా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సిఆర్‌డిఏ వ్యవస్థాపక పరిధిని పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్‌ పరిధిలో 52మండలాలు, పల్నాడులో 160గ్రామాలను సిఆర్‌డిఏలో కలుపుతూ క్యాబినెట్‌ నిర్ణయించింది.

డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్‌ అమోదంతెలిపింది.

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 చట్టం ఉపసంహరణ బిల్లుకు క్యాబినెట్‌ అమోదం తెలిపింది. భూకబ్జా దారులపై కేసులు పెట్టడానికి పలు నిబంధనలు అడ్డంకిగా ఉండటంతో రెవిన్యూ శాఖ తెచ్చిన ప్రతిపాదనలకు అమోదం తెచ్చారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ అండ్ ప్రొహిబిషన్‌ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాత చట్టాన్ని రద్దు చేస్తారు. రాష్ట్రంలో భూ ఆక్రమణలు ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతో సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రిపీల్ బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలో జరిగే శాసన సభలో పాత చట్టం రద్దు, కొత్త చట్టం రూపకల్పన చేయనున్నారు.

ఏపీలో జ్యూడిషియల్‌ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును ఏడాది పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. శాసనసభలో దీనిపై చట్ట సవరణ చేస్తారు. మద్యం విక్రయాలు, ఎక్సైజ్ పాలసీలో కొన్ని అంశాలపై ర్యాటిఫికేషన్‌ చేయనున్నారు.

అమరావతి- 2014-18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనుల ప్రారంభానికి సంబంధించి కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణను మంత్రిమండలి అమోదించింది. ఏపీ ఎక్స్రైజు చట్ట సవరణ ముసాయిదాకు కేబినెట్ అమోదం తెలిపింది.

సీఆర్డీఏ పరిధిని 8352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీల నుంచి 11 మండలాల్లో 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చారు.

Whats_app_banner