AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ.2700 కోట్ల పనులకు ఏపీ క్యాబినెట్ తెలిపింది. ఈ నిధులతో రాజధాని నిర్మాణ పనులను చేపడతారు. భవనాలకు అనుమతులు ఇచ్చే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో మునిసిపాలిటీలు అనుమతిచ్చేలా చట్ట సవరణ చేశారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో పాలనా అంశాలు కొద్దిసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాల పైన చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వ సాయం తో కలిపి ఆర్థిక సాయాన్ని రూ 20,000 ను ఒకేసారి చెల్లించే అంశంపై మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం పైన చర్చి జరిగినట్టు తెలుస్తోంది. వేట నిలిచిపోయిన సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలను వారికి చెల్లించే అంశంపై మంత్రులతో మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని సీఎం సూచించారు.
రాష్ట్రంలో ప్రధాని పర్యటన ను విజయవంతం చేసేందుకు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈనెల ఎనిమిదో తేదీన విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రధాని రోడ్ షో కూడా నిర్వహించే నేపథ్యంలో దాన్ని విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు.