NDA Mlc Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, జనసేన హరిప్రసాద్-c ramachandraiah and janasena hariprasad as mlc candidates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nda Mlc Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, జనసేన హరిప్రసాద్

NDA Mlc Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, జనసేన హరిప్రసాద్

Sarath chandra.B HT Telugu
Published Jul 02, 2024 06:28 AM IST

NDA Mlc Candidates: రాజీనామాలతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నేడు నామినేషన్ వేయనున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, రామచంద్రయ్య
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, రామచంద్రయ్య

NDA Mlc Candidates: ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, జనసేన పార్టీకి చెందిన హరిప్రసాద్‌లను ఖరారు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న రామచంద్రయ్య ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ కూడా తప పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

టిడిపి నేత సి. రామచంద్రయ్య, జనసేన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం నామినేషన్ చేయనున్నారు.

ఏపీ శాసన మండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్ధులను సోమవారం రాత్రి ఖరారు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచం ద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. టీడీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం " కల్పించింది. మరో స్థానాన్ని జనసేనకు కేటాయిం చారు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. టీడీపీ, జనసేన మధ్య కుదిరిన రాజకీయ అవగాహనలో భాగంగా చెరో స్థానాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 164మంది సభ్యుల బలం ఉండటంతో ఇద్దరి ఎన్నిక లాంఛనం కానుంది.

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారి పల్లెకి చెందిన సి.రామచంద్రయ్య చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. టీడీపీ ఆవిర్భావంతో పార్టీలో చేరిన ఆయన 1985లో కడప అసెంబ్లీ నుంచి గెలిచారు. 1986లో 20 సూత్రాల అమలు శాఖకు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీడీపీ తరపున రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.

2008 లో ప్రజా రాజ్యం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2018లో వైసీపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2021 మార్చి 8న శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 2024 జనవరి 3న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

జర్నలిస్ట్‌ నుంచి ఎమ్మెల్సీగా…

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిడుగు హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివుకున్నారు.అనంతరం విజయవాడ సిద్దార్థ కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. లా చదివినా జర్నలిజంలో కొనసా గారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్ర సాద్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. పాతికేళ్ల పాటు మీడియా రంగంలో వివిధ హోదాల్లో పని చేశారు.

హరిప్రసాద్ ఈనాడు, ఈటీ వీ2లో సుదీర్ఘకాలం పనిచేశారు. మాటీవీలో న్యూస్ హెడ్‌గా పని చేశారు. అదే ఛానల్‌లో కొంత కాలం అసోసియేట్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత సీవీఆర్ హెల్త్ ఛానల్, సీవీఆర్ హెల్త్ మ్యాగ జైన్‌ ఎడిటర్‌గా, సీవీఆర్ న్యూస్ టీవీకి కరెంట్ ఆఫైర్స్‌ హెడ్‌గా పనిచేశారు. జనసేన పార్టీ విర్భావం తర్వాత పార్టీ మీడియా విభాగం పర్యవేక్షణతో పాటు పవన్ కళ్యాణ్‌ రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Whats_app_banner