AP SSC Results 2024 : ఏపీ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌… మీ రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి-bseap announced ap ssc results 2024 know how to check results on httpswwwbseapgovin ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Results 2024 : ఏపీ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌… మీ రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి

AP SSC Results 2024 : ఏపీ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌… మీ రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 22, 2024 01:18 PM IST

AP 10th Results 2024 Updates : ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results) వచ్చేశాయ్. ఇవాళ ఉదయం 11 తర్వాత విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. ఈ ఫలితాలను HT తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ తోనే చెక్ చేసుకోవచ్చు.

ఏపీ టెన్త్ ఫలితాలు 2024 విడుదల
ఏపీ టెన్త్ ఫలితాలు 2024 విడుదల (Photo Source DD Andhra Twitter)

AP Board Class 10th Results 2024 : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results) వచ్చేశాయ్. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాదికి సంబంధించిన వివరాలను ఆయన పేర్కొన్నారు. ఫలితాలను ఏపీ SSC బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ ఏడాది 6.18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు  తెలిపారు.

How To Check AP 10th Results 2024 : HT తెలుగులో ఏపీ పదో తరగతి ఫలితాలు

  • ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024 ( https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ) లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాల కాపీని పొందవచ్చు.

AP SSC Results 2024 Website : ఏపీ SSC బోర్డు సైట్ లో టెన్త్ ఫలితాలు

  • పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ రూల్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

AP SSC Results Details 2024 : టాప్ ప్లేస్ లో మన్యం జిల్లా….

ఈసారి అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ప్లేస్ లో నిలిచింది. 96.3 శాతం ఉత్తీర్ణతో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 86.69శాతం పాస్ అయ్యారని పేర్కొన్నారు. ఇందులో బాలురు 84.32, బాలికలు 89.17 ఉత్తీర్ణులు అయ్యారని వివరించారు.ఫలితాల్లో ఈసారి బాలికలదే పైచేయి అని చెప్పారు. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని ప్రకటించారు. 17స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కర్నూల్ జిల్లా 62.47శాతం తో చివరి స్థానంలో నిలిచింది.

గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పారు ఏపీ విద్యాశాఖ కమిషనర్. ఈ ఏడాది ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్, బీసీ సంక్షేమ పాఠశాలలు అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి. ఇది 98.43 శాతంగా ఉందని తెలిపారు.

Ap SSC Supplementary Exams 2024: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 24వ తేదీ నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు(Ap SSC Supplementary Exams) జరుగుతాయని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. జూన్ 3వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగుతాయని వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజుతో పాటు రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఫీజులు చెల్లించుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ గడువు ముగుస్తుందని వివరించారు. ఆలస్య రుసుముతో మే 23వ తేదీ వరకు ఫీజును చెల్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

AP SSC Memos 2024 : 4 రోజుల్లో షార్ట్ మెమోలు…

ఫలితాలు ప్రకటించిన నాలుగు రోజుల్లో టెన్త్ షార్ట్ మెమోలను వెబ్ సైట్ లో ఉంచుతామని ఏపీ విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. పాఠశాలకు వెళ్లకుండానే… నేరుగా వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోనే అన్ని రకాల సర్టిఫికెట్లను అందజేస్తామని తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దని సూచించారు. మళ్లీ పరీక్షలు రాసుకొవచ్చన్నారు. కానీ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులను కోరారు.

ఏపీ పదో తరగతి ఫలితాల్లో టాప్ టెన్ జిల్లాలు

  1. మన్యం జిల్లా - 96.37 శాతం ఉత్తీర్ణత
  2. శ్రీకాకుళం - 93.35 శాతం
  3. వైఎస్ఆర్ కడప- 92.10 శాతం
  4. కోనసీమ జిల్లా - 91.88 శాతం
  5. విజయనగరం - 91.82 శాతం
  6. చిత్తూరు -91.28 శాతం
  7. ప్రకాశం-91.21 శాతం
  8. విశాఖపట్నం-91.15 శాతం
  9. అల్లూరి సీతారామరాజు జిల్లా- 90. 95 శాతం
  10. తిరుపతి - 90.71 శాతం