భార్యాభర్తల మధ్య గొడవ.. బావమరుదుల ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమరుదులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమరుదులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో జరిగింది.
కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందపురం సీఐ చింతా వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ తాతారావు (25) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ వ్యవసాయ పనుల్లో కుటుంబ సభ్యులకు సాయంగా ఉండేవాడు. అతడికి పిల్లను ఎవరూ ఇవ్వరని.. పెళ్లి కాదని పలువురు తరచూ అనడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన అతడు.. మధ్యాహ్నం పొలంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చెట్టుకు వేలాడుతున్న తాతారావును చూసిన గ్రామస్థులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి కోరాడ అప్పలకొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. అప్పలకొండకు ముగ్గురు సంతానం.
సంబంధిత కథనం