Nellore Murder: నెల్లూరులో ఘోరం.. వదినపై కన్నేసిన మరిది, కోరిక తీర్చలేదని చంపేశాడు..
Nellore Murder: నెల్లూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి నెల్లూరు జిల్లాలో స్థిరపడిన కుటుంబంలో వివాహిత హత్యకు గురైంది. సొంత మరిది ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తు చేశారు. లైంగిక దాడిని అడ్డుకున్న క్రమంలో హత్య జరిగినట్టు గుర్తించారు.
Nellore Murder: నెల్లూరు జిల్లా కావలిలో బెంగాల్‌కు చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. కోరిక తీర్చలేదనే కోపంతో వదిన ప్రాణాలను బలిగొన్న ఘటన అందరిని కలిచి వేసింది. మరిది చేసిన ఘాతుకంతో కుటుంబంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ బిస్వాస్ కుటుంబం కావలిలో నివాసం ఉంటోంది.
శ్రీకాంత్ కావలిలో మొలలకు చికిత్స అందించే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్ బిస్వాస్‌తో పాటు భార్య అర్పితా బిస్వాస్, వారి ఇద్దరు పిల్లలు, శ్రీకాంత్ తల్లిదం డ్రులతో పాటు అతనికి తమ్ముడి వరుసయ్యే నయ బిస్వాస్ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ భార్య అర్పితతో నయ బిస్వాస్ అసభ్యంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు అతడిని పలుమార్లు మందలించారు.
మంగళవారం శ్రీకాంత్ బిస్వాస్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లారు. ఇంట్లోనే శ్రీకాంత్ బిస్వాస్, ఆయన భార్య, తమ్ముడు నయ బిస్వాస్, ఇద్దరు పిల్లలు న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. శ్రీకాంత్ మద్యం సేవించి నిద్ర పోయాడు. అర్థరాత్రి నయ బిస్వాస్ వదిన గదిలోకి వెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె అడ్డుకోవడంతో ఇనుప రాడ్డుతో తలపై మోది హతమార్చాడు.
అర్పితా చనిపోయిందని తెలిశాక మృతదే హాన్ని వంద మీటర్ల దూరంలో ఉన్న పంట కాలు వలో పడేశాడు. ఉదయం నిద్రలేచిన శ్రీకాంత్ ఇంట్లో భార్య కనిపించక పోవడం గదిలో రక్తపు మరకలు ఉండడంతో.. స్థానికులతో కలసి సమీప ప్రాంతాల్లో గాలించారు. ఇంటికి సమీపంలోనే పంట కాలువలో అర్పితా మృతదేహం కనిపిం చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కావలి పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నయబిశ్వాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.