Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - 11న రాములోరి కల్యాణం, పూర్తి వివరాలివే-brahmotsavams will be celebrated from april 6 to 14 at sri kodandarama swamy temple in vontimitta of kadapa district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - 11న రాములోరి కల్యాణం, పూర్తి వివరాలివే

Vontimitta Brahmotsavalu 2025 : ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - 11న రాములోరి కల్యాణం, పూర్తి వివరాలివే

Vontimitta Brahmotsavalu 2025 Updates : ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది. ఏప్రిల్ 11వ తేదీన సీతారాముల కల్యాణం ఉంటుంది.

ఒంటిమిట్ట ఆలయం (ఫైల్ ఫొటో)

క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సాలను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీలతో పాటు వాహనసేవల వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగుతాయని పేర్కొంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఉంటుంది. ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

ఏప్రిల్ 11న రాములోరి కల్యాణం…

ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించే ఈ కల్యాణానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తూ.. ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై టీటీడీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, కల్యాణ వేదిక సమీపంలో ట్రాఫిక్ , భధ్రతా, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిక, స్వామివారి తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహనసేవల వివరాలు :

  • 06-04-2025 : ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.30 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు వృష‌భ‌ లగ్నం, రాత్రి – శేష వాహనం.
  • 07-04-2025 : ఉదయం – వేణుగానాలంకారము ఉంటుంది. రాత్రి హంస వాహనం నిర్వహిస్తారు.
  • 08-04-2025 : ఉదయం – వటపత్రశాయి అలంకారము, రాత్రి – సింహ వాహనం.
  • 09-04-2025 : ఉదయం – నవనీత కృష్ణాలంకారము, రాత్రి – హనుమంత వాహనం.
  • 10-04-2025 : ఉదయం – మోహినీ అలంకారము, రాత్రి – గరుడసేవ.
  • 11-04-2025 : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ, రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము.
  • 12-04-2025 : ఉదయం – రథోత్సవం.
  • 13-04-2025 : ఉదయం – కాళీయమర్ధనాలంకారము, రాత్రి – అశ్వవాహనం.
  • 14-04-2025 : ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.

ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం