TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు, 54వ ఛైర్మన్‌గా బాధ్యతలు-br naidu sworn in as ttd chairman takes charge as 54th chairman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Chairman: టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు, 54వ ఛైర్మన్‌గా బాధ్యతలు

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు, 54వ ఛైర్మన్‌గా బాధ్యతలు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 06, 2024 10:29 AM IST

TTD Chairman: టీటీడీ నూతన ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రమాణం చేశారు. ఏపీ ప్రభుత్వం బొల్లినేని రాజగోపాల నాయుడును టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయం 7.15గంటలకు రంగనాయకుల మండపంలో బోర్డు ఛైర్మన్‌, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలోని జయ విజయలు దగ్గర బీఆర్‌ నాయుడుతో టీటీడీ ఈవో , అదనపు ఈఓ, జేఈఓల సమక్షంలో ప్రమాణం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మూలవిరాట్టును టీటీడీ ఛైర్మన్‌ హోదాలో బీఆర్‌ నాయుడు దర్శించుకున్నారు. తిరుమల రంగ నాయకుల మండపంలో టీటీడీ 54వ చైర్మన్‌గా బి.ఆర్.నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు పలువురు పాలక మండలి సభ్యులు ప్రమాణం చేశారు.

బీఆర్ నాయుడు ప్రస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు.

బిహెచ్‌ఈఎల్‌ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చురుకుగా పని చేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు.

బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగం తర్వాత ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత 2007లో టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.

టీటీడీ పాలకమండలి సభ్యులు వీరే..

టీటీడీ నూతన పాలక మండలిని ప్రకటించింది. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 25మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటించింది. పాలకమండలిలో బీజేపీ, జనసేన నాయకులకు కూడా సభ్యత్వం కల్పించారు.

జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట ఎమ్మెల్యే)

భానుప్రకాష్‌( బీజేపీ-తిరుపతి)

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి -కోవూరు ఎమ్మెల్యే)

ఎంఎస్ రాజు - మడకశిర ఎమ్మెల్యే

పనబాక లక్ష్మి-కేంద్ర మాజీ మంత్రి

జాస్తి పూర్ణ సాంబశివరావు

నన్నపనేని శ్రీసదాశివరావు

కోటేశ్వరరావు

మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

జంగా కృష్ణమూర్తి

శాంతారామ్‌

తమ్మిశెట్టి జానకీ దేవి

నన్నూరి నర్సిరెడ్డి -తెలంగాణ

బూంగునూరు మహేందర్‌ రెడ్డి-తెలంగాణ

అనుగోలు రంగశ్రీ -తెలంగాణ

బూరగాపు ఆనందసాయి -తెలంగాణ

సుచిత్ర ఎల్ల -తెలంగాణ

కృష్ణమూర్తి - తమిళనాడు

పి.రామ్మూర్తి -తమిళనాడు

దర్శన్‌. ఆర్‌.ఎన్‌-కర్ణాటక

జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ - కర్ణాటక

నరేశ్‌కుమార్‌ - కర్ణాటక

డా.అదిత్‌ దేశాయ్‌ -గుజరాత్‌

శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా -మహారాష్ట్ర

Whats_app_banner