Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ప్రియురాలిని దక్కించుకోడానికి ఆమె భర్తను చంపిన ప్రియుడు
Chittoor Crime: చిత్తూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యతో వివాహేతర సంబంధ పెట్టుకుని, అడ్డువచ్చిన ఆమె భర్తను నిందితుడు హతమార్చారు. తొలిత ఈ కేసు సాధారణ హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టే పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
Chittoor Crime: చిత్తూరు జిల్లా పలమనేరులో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య జరిగింది. ప్రియుడి చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. సాధారణ హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత దర్యాప్తులు పలు మలుపు తిరిగి అక్రమం సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు వెల్లడైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పలమనేరు మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన శివకుమార్ (40)కు తమిళనాడులోని వేలూరు సమీపంలోని సదువాని గ్రామానికి చెందిన ఉషారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో గడ్డూరు క్రాస్‌లోని ఛార్మినార్ బిరియాని సెంటర్, చికెన్ సెంటర్ నిర్వాహకుడు షమీర్ వద్ద ఎనిమిది నెలలుగా ఉషారాణి పని చేస్తోంది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఉషారాణితో షమీర్‌కు వివాహేతర సంబంధానికి కారణం అయింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధ వ్యవహారం భర్త శివ కుమార్‌కు తెలిసింది. దీంతో తరచూ ఇంట్లో గొడవులు జరిగేవి.
భార్య ఉషారాణిని అదుపులో ఉంచుకోవడానికి శివ కుమార్ ప్రయత్నించాడు. అయితే శివకుమార్ మాటలను భార్య పెడచెవిని పెట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ 3న ఉషారాణి, నిందితుడు షమీర్ ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లారు. అక్కడే పది రోజులు పాటు కలిసి ఉన్నారు.
అయితే ఉషారాణి తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని భావించి షమీర్‌కు నచ్చజెప్పి తిరిగి సొంత గ్రామానికి వచ్చేసింది. ఈ విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శివ కుమార్ సిద్ధపడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు వస్తాయని ఉషారాణిని తన పుట్టిల్లు సదువాని గ్రామానికి పంపేశాడు.
తరువాత పెద్దల సమక్షంలో మాట్లాడి ఉషారాణిని భర్తతో ముసలిమడుగుకు పంపారు. ఈ నేపథ్యంలో ఉషారాణిని ఇకపై కలుసుకోనని శివకుమార్‌ను షమీర్ నమ్మించాడు. శివ కుమార్‌తో షమీర్ సన్నిహితంగా ఉంటూ ఈనెల 13న (గత సోమవారం) పలమనేనరు పొలిమేరల్లోని హెచ్‌పీ పెట్రోల్ బంకు వెనుక వైపుకి తీసుకెళ్లాడు.
అక్కడ శివ కుమార్ చేత మద్యం ఫుల్‌గా తాగించాడు. మద్యం మత్తులో ఉన్న శివ కుమార్‌పై బండరాయితో దాడి చేశాడు. దీంతో శివ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులు పట్టుకుంటారని భావించిన షమీర్ బెంగళూరు వెళ్లిపోయాడు. అయితే దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు షమీర్‌ని ఆదివారం బంగారుపాళ్యం మండలం సమీపంలోని ఫైఓబర్ వద్ద పలమనేరు సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజ, ఇతర పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడును విచారించగా ఈ వివరాలు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధమే శివ కుమార్ హత్యకు కారణమని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. మృతిని బట్టలపైన రక్తపు మరకలు ఉన్నాయని, వాటిని ల్యాబ్‌కు పంపామని పేర్కొన్నారు. అదేవిధంగా నిందితుడు ఫోన్లో ఉన్న నెంబర్లు ద్వారా మరికొన్ని వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)